వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా ప్రధాని మోదీ దిశానిర్దేశం.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం!

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రి మండలి అత్యంత కీలక సమావేశం జరిగింది. తన ఐదు దేశాల పర్యటన ముగించుకుని గురువారం ఢిల్లీకి తిరిగి వచ్చిన వెంటనే ప్రధాని ఈ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. దాదాపు నాలుగున్నర గంటల పాటు అర్థరాత్రి వరకు సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో దేశ ఆర్థిక పరిస్థితులు, అంతర్జాతీయ పరిణామాలు, ప్రభుత్వ విధివిధానాలపై ప్రధాని మోదీ కేంద్రమంత్రులకు కీలక మార్గదర్శకత్వం చేశారు.

వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా ప్రధాని మోదీ దిశానిర్దేశం.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం!
Pm Modi Calls Cabinet Meeting

Updated on: May 22, 2026 | 7:18 AM

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రి మండలి అత్యంత కీలక సమావేశం జరిగింది. తన ఐదు దేశాల పర్యటన ముగించుకుని గురువారం ఢిల్లీకి తిరిగి వచ్చిన వెంటనే ప్రధాని ఈ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. దాదాపు నాలుగున్నర గంటల పాటు అర్థరాత్రి వరకు సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో దేశ ఆర్థిక పరిస్థితులు, అంతర్జాతీయ పరిణామాలు, ప్రభుత్వ విధివిధానాలపై ప్రధాని మోదీ కేంద్రమంత్రులకు కీలక మార్గదర్శకత్వం చేశారు.

“2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశాన్ని (వికసిత్ భారత్) నిర్మించడం అనేది కేవలం ఒక నినాదం కాదు.. అది మన ప్రభుత్వ నిబద్ధత” అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం భారత్‌కు ఉన్న సానుకూల వాతావరణాన్ని పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. గవర్నెన్స్‌లో సరళత, సమర్థత, ఉత్పాదకతను పెంచాలని, తక్కువ సమయంలో ఎక్కువ ఫలితాలను సాధించేలా పని సంస్కృతిని మెరుగుపరుచుకోవాలని మంత్రులను ఆదేశించారు.

ప్రభుత్వ నిర్ణయాలు వేగంగా తీసుకోవాలని, ఫైళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యం చేయకూడదని ప్రధాని గట్టిగా హెచ్చరించారు. వివాదాలకు దూరంగా ఉంటూ తమ పనిపైనే దృష్టి పెట్టాలని మంత్రులకు సూచించారు. “మన ప్రభుత్వం 2014 నుండి అధికారంలో ఉంది, ఇప్పుడు 2026 నడుస్తోంది. కాబట్టి గతించిన కాలం గురించి కాకుండా, భవిష్యత్తులో మనం ఏం చేయగలమనే దానిపైనే దృష్టి పెట్టాలి” అని మోదీ అన్నారు. పెండింగ్‌లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని, పనితీరు అంచనాల్లో వెనుకబడిన శాఖలు వెంటనే తప్పులను సరిదిద్దుకోవాలని ఆదేశించారు.

పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితులు, వాటి వల్ల ముడి చమురు సరఫరాపై పడుతున్న ప్రభావం, ఇంధన భద్రత, ధరల పెరుగుదల వంటి అంశాలపై కేబినెట్ లో సుదీర్ఘంగా చర్చించారు. ద్రవ్యోల్బణ నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను, అలాగే కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏర్పడి 12 సంవత్సరాలు (మూడో పర్యాయంలో రెండేళ్లు) పూర్తయిన సందర్భంగా సాధించిన విజయాలు, సంస్కరణలను ప్రజలకు క్షేత్రస్థాయిలో వివరించాలని మంత్రులను కోరారు.

ఈ సమావేశంలో వ్యవసాయం, అడవులు, కార్మిక, రోడ్డు రవాణా, కార్పొరేట్ అఫైర్స్, విదేశీ వ్యవహారాలు, వాణిజ్యం, విద్యుత్ వంటి తొమ్మిది కీలక మంత్రిత్వ శాఖల పనితీరు, సంస్కరణలపై కార్యదర్శులు ప్రధానికి ప్రజెంటేషన్లు ఇచ్చారు. మంత్రులలో కేవలం విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ మాత్రమే ప్రధాని ఇటీవలి 5 దేశాల పర్యటన విజయాలు, ప్రపంచ దేశాల స్పందన, భారతదేశానికి దాని ప్రాముఖ్యతపై సవివరమైన ప్రజెంటేషన్‌ను కేబినెట్‌కు వివరించారు. ప్రజల జీవన సౌలభ్యాన్ని (ఈజ్ ఆఫ్ లివింగ్) పెంపొందించడమే లక్ష్యంగా మంత్రులంతా బాధ్యతాయుతంగా పనిచేయాలని ప్రధాని మోదీ ముగించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us