PM Modi: ఆ యువతి ప్రతిభను మెచ్చుకున్న ప్రధాని మోదీ.. ఆమెకు ఇచ్చిన సలహా ఏంటంటే

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన తనిష్క సుజిత్ అనే విద్యా్ర్థి 11 ఏళ్లకే పదో తరగతి పూర్తి చేసింది. 15 ఏళ్లకే బీఏ ఫైనల్ పరీక్షలు రాసేందుకు సిద్ధమైంది. డిగ్రీ అయిపోయాక లా కోర్సు చదివి భారత ప్రధన న్యాయమూర్తి కావలనే లక్ష్యంలో ఆ యువతి ముందుకు సాగుతోంది.

PM Modi: ఆ యువతి ప్రతిభను మెచ్చుకున్న ప్రధాని మోదీ.. ఆమెకు ఇచ్చిన సలహా ఏంటంటే
Tanishka Sujeet With Pm Modi

Updated on: Apr 12, 2023 | 7:29 AM

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన తనిష్క సుజిత్ అనే విద్యా్ర్థి 11 ఏళ్లకే పదో తరగతి పూర్తి చేసింది. 15 ఏళ్లకే బీఏ ఫైనల్ పరీక్షలు రాసేందుకు సిద్ధమైంది. డిగ్రీ అయిపోయాక లా కోర్సు చదివి భారత ప్రధన న్యాయమూర్తి కావలనే లక్ష్యంలో ఆ యువతి ముందుకు సాగుతోంది. కానీ 2020లో కరోనా బారిన పడి ఆమె తండ్రి, తాతలు ప్రాణాలు కోల్పోయారు. ఆ బాధను తట్టుకుని మనోధైర్యంతో తన లక్ష్యం వైపు అడుగులు వేస్తోంది. అయితే ఇటీవల భోపాల్ లోని కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్ కోసం తనిష్క వెళ్లింది. ఈ సందర్భంగా అక్కడే ప్రధాని మోదీని కలసి దాదాపు 15 నిమిషాలు మాట్లాడుకున్నారు,

అయితే తాను బీఏ పరీక్షల్లో పాస్ అయ్యాక అమెరికాలో న్యాయశాస్త్రం చదవాలనుకుంటున్నానని..ఏదో రోజు భారత ప్రధాన న్యాయమూర్తి కావడమే తన లక్ష్యమని ప్రధాని మోదీకి తెలియజేసింది. ఆమె గురించి తెలుసుకున్న ప్రధాని తనిష్కను మెచ్చుకున్నారు. సుప్రీంకోర్టుకు వెళ్లి అక్కడ న్యాయవాదుల వాదనలు చూడాలని ఆమెకు సలహా కూడా ఇచ్చినట్లు తనిష్క తెలిపింది. నా లక్ష్యాన్ని సాధించేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ఇదిలా ఉండగా తనిష్క కు 13 ఏళ్ల వయసులో దేవి అహల్య విశ్వవిద్యాలయం నిర్వహించిన ప్రవేశ పరీక్షలో ప్రతిభ చూపడంతో బీఏ సైకాలజీ మొదటి సంవత్సరంలో ప్రవేశం లభించినట్లు సోషల్ స్టడీస్ విభాగాధిపతి రేఖా ఆచార్య తెలిపారు.

 

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..