కోళీకోడ్‌ విమాన ప్ర‌మాద మృతుల‌కు ప‌ది ల‌క్ష‌ల నష్ట‌ప‌‌రిహారం

కేర‌ళ‌లోని కోళీకోడ్‌లో ఎయిర్ ఇండియా విమానం కుప్ప కూలిన ఘ‌టన‌లో మృతి చెందిన కుటుంబ స‌భ్యుల‌కు తాత్కాలికంగా రూ.10 ల‌క్ష‌ల న‌ష్ట ప‌రిహారాన్ని ఇవ్వ‌నున్న‌ట్లు పౌర విమానయాన శాఖ మంత్రి హ‌రిదీప్ సింగ్ పురి తెలిపారు. తీవ్రంగా గాయ‌ప‌డ్డ‌వారికి రెండు ల‌క్ష‌లు..

కోళీకోడ్‌ విమాన ప్ర‌మాద మృతుల‌కు ప‌ది ల‌క్ష‌ల నష్ట‌ప‌‌రిహారం
Follow us

| Edited By:

Updated on: Aug 08, 2020 | 2:25 PM

కేర‌ళ‌లోని కోళీకోడ్‌లో ఎయిర్ ఇండియా విమానం కుప్ప కూలిన ఘ‌టన‌లో మృతి చెందిన కుటుంబ స‌భ్యుల‌కు తాత్కాలికంగా రూ.10 ల‌క్ష‌ల న‌ష్ట ప‌రిహారాన్ని ఇవ్వ‌నున్న‌ట్లు పౌర విమానయాన శాఖ మంత్రి హ‌రిదీప్ సింగ్ పురి తెలిపారు. తీవ్రంగా గాయ‌ప‌డ్డ‌వారికి రెండు ల‌క్ష‌లు, స్వ‌ల్పంగా గాయ‌ప‌డ్డ‌వారికి 50 వేల‌ను అత్య‌వ‌స‌రంగా ఇవ్వ‌నున్న‌ట్లు మంత్రి తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. విమాన శిథిలాల‌ను కేంద్ర మంత్రి హ‌రిదీప్ ప‌రిశీలించారు. ప్ర‌మాద సైట్‌కు వెళ్లిన ఆయ‌న అధికారుల‌తో ఆ ప్రాంతాన్ని త‌నిఖీ చేశారు. స‌రిగ్గా ప‌దేళ్ల క్రితం మంగ‌ళూరులో జ‌రిగిన విమాన ప్ర‌మాదాన్ని గుర్తు చేసుకున్నారు. అయితే అప్పుడు జ‌రిగినంత ప్రాణ న‌ష్టం ఇప్పుడు ఎక్కువ‌గా జ‌ర‌గ‌లేద‌న్నారు. మంగుళూరు విషాదంలో విమానానికి నిప్పు అంటుకున్న‌ద‌ని కానీ కోళీకోడ్ ప్ర‌మాదంలో అలా జ‌ర‌గ‌క‌పోవ‌డ వ‌ల్ల ప్రాణ న‌ష్టం త‌ప్పింద‌ని మంత్రి తెలిపారు.