AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘వాళ్ళు’ ఇండియాకు రావచ్చు, హోం శాఖ క్లారిటీ

అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ దేశాల్లో ఓసీఐ (ఓవర్ సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా) కార్డు హోల్డర్లను ఇండియాలో ప్రవేశించేందుకు అనుమతిస్తామని హోం శాఖ ప్రకటించింది...

'వాళ్ళు' ఇండియాకు రావచ్చు, హోం  శాఖ క్లారిటీ
Umakanth Rao
| Edited By: |

Updated on: Aug 08, 2020 | 3:29 PM

Share

అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ దేశాల్లో ఓసీఐ (ఓవర్ సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా) కార్డు హోల్డర్లను ఇండియాలో ప్రవేశించేందుకు అనుమతిస్తామని హోం శాఖ ప్రకటించింది. ఇతర దేశాల్లోని ఇతర విదేశీయులను కూడా వ్యాపార, ఉద్యోగ, వైద్య రంగాల నిమిత్తం భారతీయ వీసాపై అనుమతించనున్నట్టు పేర్కొంది. అలాగే ఏ తరహా వీసాపైనైనా ఈ దేశాలకు వెళ్లేందుకు పర్మిషన్ ఇస్తామని, ముఖ్యంగా అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలతో మనకు ద్వైపాక్షిక వైమానిక సంబంధ ఒప్పందాలు ఉన్నాయని ఈ శాఖ వివరించింది. దీనివల్ల ఓసీఐ కార్డు హోల్డర్లకు మంచి వెసులుబాటు కల్పించినట్టు అవుతుందని హోం శాఖ వర్గాలు పేర్కొన్నాయి. ఈ దేశాలతో ఇండియాకు ట్రావెల్ అరేంజ్ మెంట్స్ ఉన్నాయి.

ఈ కరోనా తరుణంలో అంతర్జాతీయ ప్రయాణ ఆంక్షలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్టుల ద్వారా ఇండియాకు వచ్ఛే ప్రయాణికులపై ప్రస్తుత ఆంక్షలను కొనసాగించాలని, అలాంటి వారికి అనుమతి ఉండదని ఈ వర్గాలు క్లారిటీ ఇచ్చాయి.