AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాజస్థాన్‌లో సీఎం దిష్టిబొమ్మ దహనం చేసిన సచిన్ వర్గం..

రాజస్థాన్‌ రాజకీయాలు మరింత హాటెక్కాయి. డిప్యూటీ సీఎం పదివితో పాటు పార్టీ చీఫ్ బాధ్యతల నుంచి సచిన్ పైలట్‌ను తొలగించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సచిన్ పైలట్‌ వర్గం కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీపై తీవ్ర..

రాజస్థాన్‌లో సీఎం దిష్టిబొమ్మ దహనం చేసిన సచిన్ వర్గం..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 15, 2020 | 4:30 AM

Share

రాజస్థాన్‌ రాజకీయాలు మరింత హాటెక్కాయి. డిప్యూటీ సీఎం పదివితో పాటు పార్టీ చీఫ్ బాధ్యతల నుంచి సచిన్ పైలట్‌ను తొలగించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సచిన్ పైలట్‌ వర్గం కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం ఏకంగా రాజస్థాన్‌ సీఎం అశోక్ గెహ్లాట్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సంఘటన రాష్ట్రంలోని సచిన్ పైలట్ నియోజకవర్గంలో చోటుచేసుకుంది. సవాయ్ మాదోపూర్‌ ప్రాంతంలో పైలట్‌కు మద్దతుగా నినాదాలు చేస్తూ.. అశోక్ గెహ్లాట్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. అంతేకాదు.. పార్టీలో పలు కీలక పదవుల్లో ఉన్న నేతలు సచిన్ పైలట్‌కు మద్దతు ఇస్తూ.. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పటికే పలు జిల్లాల అధ్యక్షుటు పార్టీకి రాజానామా చేస్తూ వారి నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సచిన్ పైలట్‌ వర్గం మంత్రులను ఇద్దర్ని తొలగించిన సంగతి కూడా తెలిసిందే. దీంతో ఇక సచిన్ వర్గం దాదాపు కాంగ్రెస్ పార్టీకి గుడ్‌ బై చెప్పబోతున్నట్లు సంకేతాలు అందాయి. మరోవైపు రాజస్థాన్‌ ప్రభుత్వం మైనార్టీలో పడిపోయిందంటూ బీజేపీ ఆరోపిస్తోంది. ఇక బలప్రదర్శన చేపట్టాలని డిమాండ్ చేస్తోంది. అయితే అశోక్‌ గెహ్లాట్ మాత్రం తమ ప్రభుత్వానికి కావాల్సిన బలం ఉందని చెబుతున్నారు.

Follow Us
కేకేఆర్‌ను రప్ఫాడించిన గిల్.. గుజరాత్ ఖాతాలో హ్యాట్రిక్ విక్టరీ
కేకేఆర్‌ను రప్ఫాడించిన గిల్.. గుజరాత్ ఖాతాలో హ్యాట్రిక్ విక్టరీ
బీ అలర్ట్.. స్వచ్ఛమైన పాలు తాగుతున్నారా లేదా తెలుసుకోండిలా
బీ అలర్ట్.. స్వచ్ఛమైన పాలు తాగుతున్నారా లేదా తెలుసుకోండిలా
బరువు తగ్గడానికి ఈజీ మార్గం ఏంటో తెలుసా
బరువు తగ్గడానికి ఈజీ మార్గం ఏంటో తెలుసా
భారీ సిక్సర్‌తో రూ. 20 లక్షల కారుకు డ్యామేజ్.. కట్‌చేస్తే..
భారీ సిక్సర్‌తో రూ. 20 లక్షల కారుకు డ్యామేజ్.. కట్‌చేస్తే..
మనవళ్లు, మనవరాళ్లతో నటుడు రాజా రవీంద్ర.. ఫ్యామిలీ ఫొటోస్ ఇదిగో
మనవళ్లు, మనవరాళ్లతో నటుడు రాజా రవీంద్ర.. ఫ్యామిలీ ఫొటోస్ ఇదిగో
మామిడిపండు తిన్న అరగంట వరకు ఈ పని అస్సలు చేయద్దు
మామిడిపండు తిన్న అరగంట వరకు ఈ పని అస్సలు చేయద్దు
గ్యాస్ బుక్ చేసిన కొన్ని రోజులకు వచ్చిన మెసేజ్ చూసి వినియోగదారుడు
గ్యాస్ బుక్ చేసిన కొన్ని రోజులకు వచ్చిన మెసేజ్ చూసి వినియోగదారుడు
మీ ఆదాయం ట్యాక్స్‌ పరిధిలోకి రాకున్నా ఐటీఆర్‌ ఎందుకు దాఖలు చేయాలి
మీ ఆదాయం ట్యాక్స్‌ పరిధిలోకి రాకున్నా ఐటీఆర్‌ ఎందుకు దాఖలు చేయాలి
హీరో కావాలనుకున్న పరుచూరి వెంకటేశ్వరరావు కుమారుడు ఎలా చనిపోయాడు?
హీరో కావాలనుకున్న పరుచూరి వెంకటేశ్వరరావు కుమారుడు ఎలా చనిపోయాడు?
మహిళా బిల్లుపై కేంద్రం ‘ప్లాన్-బి’ ఏంటి?
మహిళా బిల్లుపై కేంద్రం ‘ప్లాన్-బి’ ఏంటి?