Train Accident: ప్రయాణికుడి ప్రాణం ఖరీదు రూ.15వేలు.. రైల్వే శాఖ తీరుపై మండిపడుతున్న జనాలు..

ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో నీలాంచల్ ఎక్స్‌ప్రెస్‌లో మెడకు ఇనుప చువ్వ గుచ్చుకుని హరికేశ్ కుమార్ దూబే అనే ప్రయాణికుడు చనిపోయిన విషయం విదితమే. ఇదే సమయంలో రైల్వే శాఖ చేసిన పనిపై సర్వత్రా విమర్శలు...

Train Accident: ప్రయాణికుడి ప్రాణం ఖరీదు రూ.15వేలు.. రైల్వే శాఖ తీరుపై మండిపడుతున్న జనాలు..
Neelachal Express
Follow us

|

Updated on: Dec 04, 2022 | 7:04 AM

ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో నీలాంచల్ ఎక్స్‌ప్రెస్‌ రైలులో మెడకు ఇనుప చువ్వ గుచ్చుకుని హరికేశ్ కుమార్ దూబే అనే ప్రయాణికుడు చనిపోయిన విషయం విదితమే. ఇదే సమయంలో రైల్వే శాఖ చేసిన పనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హరికేశ్ మృతి చెందిన తరువాత అతని కుటుంబానికి పరిహారంగా రూ.15వేలు ఇచ్చింది. అయితే దానిని తీసుకునేందుకు హరికేశ్ తండ్రి సంత్రమ్ దూబే నిరాకరించారు. తమ కుమారుడి మరణానికి మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఎవరికీ లేదని, చనిపోయాడన్న కనీస బాధ కూడా లేకుండా కేవలం నామామాత్రపు పరిహారం ఇచ్చి చేతులు దులుపుకోవాలని చూస్తోందని రైల్వే శాఖ తీరుపై మండిపడ్డారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన రైల్వే ఉద్యోగిపై కఠిన చర్యలు తీసుకోవాలని బంధువులు డిమాండ్ చేశారు. ఈ సంఘటన తర్వాత.. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించారు. మృతుడి కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారం ప్రకటించారు. మృతుడి కుటుంబంలో ఒకరికి రైల్వేలో ఉద్యోగం ఇప్పించాలని కుటుంబ సభ్యుల డిమాండ్ ను పరిశీలిస్తామన్నారు.

తన కుమారుడి మృతికి పరిహారంగా రూ.15,000 ఇస్తానని రైల్వే అధికారి ఎస్‌కే శుక్లా చెబుతున్నారని.. అయితే దానిని అంగీకరించడానికి తాము నిరాకరించినట్లు మృతుడి తండ్రి సంత్ రామ్ దూబే తెలిపారు. చనిపోయిన వ్యక్తికి ఇద్దరు కుమారులు ఉన్నారని, వారి కుటుంబ పరిస్థితుల దృష్ట్యా.. అతని భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరుతున్నారు. కాగా.. ఈ నెల 2న రైలులో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికునికి కిటికీ బయట నుంచి బయటకు వచ్చిన ఓ ఇనుప చువ్వ గుచ్చుకుంది. దీంతో అతను మృతిచెందాడు. ఈ ఘటన ఢిల్లీ నుంచి కన్పూర్ వెళ్లే నీలాంచర్ ఎక్స్ ప్రెస్ లో జరిగింది.

ఉత్తరప్రదేశ్ లోని సుల్తాన్ పూర్ జిల్లాకు చెందిన హరికేశ్ కుమార్ దుబే శుక్రవారం నీలాంచల్ ఎక్స్ ప్రెస్ రైలులో ప్రయాణిస్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. రైలు కదులుతున్న సమయంలో బయట నుంచి ఓ ఇనుప రాడ్ కిటికీ అద్దాలను పగులగొట్టుకుని హరికేశ్ మెడలో గుచ్చుకుంది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే.. రైలు వెళ్తున్న దారిలో పక్కనే రైల్వే నిర్మాణ పనులు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..

చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..