పతంజలి ‘కొరొనిల్’ పై మరో వివాదం, తాము సమీక్షించలేదన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఏది నిజం ?

Patanjali Coronil: కోవిడ్-19 ని నివారించి రోగనిరోధక శక్తిని పెంచుతుందని ప్రచారంలో ఉన్న పతంజలి సంస్థ వారి కొరొనిల్ మరో వివాదంలో చిక్కుకుంది. యోగా గురు బాబా రామ్ దేవ్ ప్రమోట్ చేసిన ఈ మెడిసిన్...

పతంజలి 'కొరొనిల్' పై మరో వివాదం, తాము సమీక్షించలేదన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఏది నిజం ?
Patanjali Coronil
Follow us

| Edited By: Team Veegam

Updated on: Feb 22, 2021 | 11:35 AM

Patanjali Coronil: కోవిడ్-19 ని నివారించి రోగనిరోధక శక్తిని పెంచుతుందని ప్రచారంలో ఉన్న పతంజలి సంస్థ వారి కొరొనిల్ మరో వివాదంలో చిక్కుకుంది. యోగా గురు బాబా రామ్ దేవ్ ప్రమోట్ చేసిన ఈ మెడిసిన్ సర్టిఫికేషన్ పై అయోమయం నెలకొంది. తమ మందు ఆయుర్వేద మూలికలతో తయారైనదని, ఇది కరోనా వైరస్ ని సమర్థంగా నివారిస్తుందని ఆయన చెప్పుకున్నారు. ఈ నెల 19 న కేంద్ర మంత్రులు హర్షవర్ధన్, నితిన్ గడ్కరీ హాజరైన ఓ  కార్యక్రమంలో దీన్ని ‘ఫస్ట్ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ ఫర్ కోవిడ్-19’ మందుగా పేర్కొన్నారు. అంటే ఈ వైరస్ కి తొలి సమర్థ మెడిసిన్ అని వివరించారు. దీనికి ఫార్మాస్యూటికల్ ప్రాడక్ట్ గా సర్టిఫికెట్ లభించిందని, ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన గుడ్ మాన్యుఫాక్చరింగ్ ప్రాక్టీసెస్ విభాగం గుర్తించిందని బాబా రామ్ దేవ్  తెలిపారు. కానీ తాము దీన్ని రివ్యూ చేయలేదని,అలాగే సాంప్రదాయక మందుగా  సర్టిఫై చేయలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. కోవిడ్   ట్రీట్ మెంట్ కి సంబందించి  తాము ఎలాంటి మెడిసిన్ నూ సమీక్షించలేదని ట్వీట్ చేసింది.

కానీ ఈ సంస్థ సర్టిఫికేషన్ స్కీమ్  ప్రకారం.. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ కి చెందిన ఆయుష్ విభాగం నుంచి ఫార్మాస్యూటికల్ ప్రాడక్ట్ గా సర్టిఫికెట్ పొందిందని బాబా రామ్ దేవ్ చెప్పారు. దీన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిందని పతంజలి ఆయుర్వేద ఎగ్జిక్యూటివ్ లలో ఒకరైన రాకేష్ మిట్టల్ తెలిపారు.  కొరొనిల్ విషయంలో అయోమయం లేదని, డీసీజీఐ దీనికి సర్టిఫికెట్ జారీ చేసిందని పతంజలి సంస్థ ఎండీ ఆచార్య బాలకృష్ణ తెలిపారు. అసలు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏ మందునూ ఆమోదించబోదని, అదే సమయంలో  దేన్నీ తిరస్కరించబోదని ఆయన ట్వీట్ చేశారు. కాగా… కొరొనిల్ ని ప్రమోట్ చేసేందుకు ఆరోగ్య శాఖ మంత్రి దేశాన్ని అయోమయంలోకి నెడుతున్నారని శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది ఆరోపించారు. ఇది దేశాన్ని ఛీట్ చేయడమే అవుతుందని అన్నారు.

మరిన్ని చదవండి ఇక్కడ :

దుబాయ్ పోలీస్ స్టేషన్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు : Mahesh Babu in Dubai Smart police Station Video

అందంగా ఉందని యువతిని ఉద్యోగం నుంచి తొలగింపు 

Solar Heated Tent : శీతల ప్రాంతాల్లోని సరిహద్దుల వద్ద సైనికుల కోసం స్పెషల్ టెంట్.. ప్రత్యేకతలు ఏమిటో తెలుసా..!