గాల్లో విమానం ఎగురుతుండగా ఎమర్జెన్సీ డోర్ తెరవబోయాడు, తృటిలో ఎంత ప్రమాదం తప్పింది ?
తృటిలో ఓ ఘోర విమాన ప్రమాదంతప్పింది. విమానం గాల్లో ఎగురుతుండగా ఆ విమానంలోని ప్రయాణికుల్లో ఒకరు హఠాత్తుగా లేచి ఎమర్జెన్సీ డోర్ తెరవబోయాడు.
తృటిలో ఓ ఘోర విమాన ప్రమాదంతప్పింది. విమానం గాల్లో ఎగురుతుండగా ఆ విమానంలోని ప్రయాణికుల్లో ఒకరు హఠాత్తుగా లేచి ఎమర్జెన్సీ డోర్ తెరవబోయాడు. అప్రమత్తమైన ఇతర ప్రయాణికులు వెంటనే అతడ్ని పట్టుకోవడంతో డేంజర్ తప్పిపోయింది. శనివారం ఢిల్లీ నుంచి వారణాసి వెళ్తున్నస్పైస్ జెట్ విమానంలో ఈ ఘటన జరిగింది. ఇందులో 89 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరంతా వారణాసి వెళ్తున్నవారే.. ఈ వ్యక్తి ఒక్క ఉదుటన లేచి ఎమర్జెన్సీ డోర్ తెరవడానికి ప్రయత్నించాడు. ఎందుకో అనుమానం వచ్చిన ఇతర ప్రయాణికులు ఇతడిని పట్టుకున్నారు. తాను ఎందుకు అలా చేశానో ఆ వ్యక్తి చెప్పలేకపోయాడు. చివరకు సురక్షితంగా ఈ ప్లేన్ వారణాసిలో దిగింది. ఈ వ్యక్తిని అక్కడి వైమానిక అధికారులకు ప్రయాణికులు, విమాన సిబ్బంది అప్పగించారు. బహుశా ఇతడి మానసిక ప్రవర్తన బాగా లేదని భావిస్తున్నారు. లోగడ ఈ విధమైన ఘటనలు ఎన్నడూ జరగలేదు. ఈ వ్యక్తి ఎక్కడివాడు, ఎందుకు ఇలా చేశాడన్న దానిపై దరాప్తు జరుగుతోంది.
ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
మరిన్ని ఇక్కడ చదవండి: Gas Cylinder Booking: మీ వంట గ్యాస్ సిలిండర్‌ను ఇలా బుక్ చేసుకుంటే రూ.170కే సిలిండర్‌ను పొందవచ్చు