విద్యార్థుల ఆత్మహత్యలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. దేశంలో ప్రతిరోజూ ఏదో ఒక చోట విద్యార్థుల బలవన్మరణాలు జరుగుతూనే ఉన్నాయి. జతీయ నేర నమోదుల విభాగం – 2020 నివేదిక ప్రకారం దేశంలో సుమారు 8.2 శాతం మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు తేలింది. దీనిబట్టి అర్థం చేసుకోవచ్చు విద్యార్థుల ఆత్మహత్యలు ఎంతటి సీరియస్ అంశమో. ఇదిలా ఉంటే తాజాగా సుప్రీం కోర్ట్ విద్యార్థుల బలవన్మరణంపై సంచనల వ్యాఖ్యలు చేసింది.
దేశంలో విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుతుండంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. తీవ్రమైన పోటీ, తల్లిదండ్రుల ఒత్తిడే విద్యార్థుల బలవన్మరణాలకు ప్రధాన కారణమి అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. కోచింగ్ సెంటర్లను నియంత్రించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సోమవారం సుప్రీంలో విచారణ జరిగింది. ఈ సందర్భంగానే కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. కోచింగ్ సెంటర్లను నియంత్రించడం విషయంలో.. సంజీవ్ ఖన్నా, ఎస్‌వీఎన్ భట్టీలతో కూడిన ధర్మాసనం నిస్సహాయత వ్యక్తం చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో కోచింగ్ సెంటర్లను నియంత్రించేలా న్యాయవ్యవస్థ ఆదేశాలు జారీ చేయలేమని తెలిపింది.
కోచింగ్ సెంటర్లను నియంత్రించడం తేలికైన విషయం కాదన్న సుప్రీం కోర్ట్.. ఇటువంటి సంఘటనలన్నింటి వెనక తల్లిదండ్రుల ఒత్తిడే అధికంగా ఉంటుందని అభిప్రాయపడింది. కోచింగ్ సెంటర్లు ఉండకూడదని చాలామంది కోరుకుంటారు. కానీ, పాఠశాలల్లో పరిస్థితులు, అక్కడ తీవ్రమైన పోటీ.. ఈ నేపథ్యంలోనే విద్యార్థులు ఈ కోచింగ్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారని జస్టిస్ సంజీవ్ ఖన్నా తెలిపారు. దేశంలో దాదాపు 8.2శాతం మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారంటూ ఊటంకించారు. పిటిషనర్ ధర్మాసం ఈ పరిస్థితిపై తమకూ అవగాహన ఉందని, అయినప్పటికీ ఆదేశాలు జారీ చేయలేమని స్పష్టం చేసింది. ప్రభుత్వాన్ని సంప్రదించాలని పిటిషనర్‌కు సూచించింది.
ఇక పిటిషన్‌లో విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రస్తావించారు. కోచింగ్ సెంటర్లు పిల్లల మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని, ఇది వారిని అసాధారణ పరిస్థితుల్లో జీవించేలా, చదువుకునేలా చేస్తుందని తెలిపారు. మానసిక ఆరోగ్యం చాలా ప్రమాదకరైందని, శరీరంలోని ఇతర వ్యాధుల్లా మానసకి అనారోగ్యం కనిపించదని తెలిపారు. అయితే ఇతర శారీరక రుగ్మతల మాదిరిగానే మానసిక ఆరోగ్యం కూడా చుట్టుపక్కల వాతావరణం, ఒత్తిళ్ల ద్వారా ప్రేరేపితమవుతాయని, విద్యార్థుల ఆత్మహత్యలు మానవ హక్కులకు సంబంధించిన తీవ్ర ఆందోళన అని పిటిషన్‌లో పేర్కొన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..