Drunk Passenger: ఇండిగో విమానంలో శ్రుతి మించిన తాగుబోతు లీలలు.! ఫ్లైట్ లో అనుచిత ప్రవర్తన.

విమాన ప్రయాణంలో కొందరు ప్రయాణికుల అనుచిత ప్రవర్తన శ్రుతి మించుతోంది. కొందరు ప్రయాణికులు మద్యం మత్తులో తోటి ప్రయాణికులను దుర్భాషలాడటం, మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ లైంగిక దాడులకు పాల్పడటం ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే ఇలాంటి ఘటనలు అనేకం వెలుగులోకి వచ్చాయి. తాజాగా ఇండిగో ఫ్లైట్‌లో ఓ 32 ఏళ్ల ప్రయాణికుడూ ఇలాగే చేశాడు.

Drunk Passenger: ఇండిగో విమానంలో శ్రుతి మించిన తాగుబోతు లీలలు.! ఫ్లైట్ లో అనుచిత ప్రవర్తన.

|

Updated on: Nov 21, 2023 | 8:42 AM

విమాన ప్రయాణంలో కొందరు ప్రయాణికుల అనుచిత ప్రవర్తన శ్రుతి మించుతోంది. కొందరు ప్రయాణికులు మద్యం మత్తులో తోటి ప్రయాణికులను దుర్భాషలాడటం, మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ లైంగిక దాడులకు పాల్పడటం ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే ఇలాంటి ఘటనలు అనేకం వెలుగులోకి వచ్చాయి. తాజాగా ఇండిగో ఫ్లైట్‌లో ఓ 32 ఏళ్ల ప్రయాణికుడూ ఇలాగే చేశాడు. అసలేం జరిగిందంటే.. ఇండిగో విమానం నవంబర్‌ 17న జైపూర్‌ నుంచి బెంగళూరు బయలుదేరింది. ఆ విమానంలో ఓ 32 ఏళ్ల ప్రయాణికుడు మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు. క్రూ సిబ్బంది పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. సిబ్బంది ఆ ప్రయాణికుడిని పలు మార్లు హెచ్చరించినప్పటికీ అతడి ప్రవర్తనలో ఎలాంటి మార్పూ రాలేదు. దీంతో విమాన సిబ్బంది ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఇక విమానం బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్‌కాగానే సదరు ప్రయాణికుడ్ని పోలీసులకు అప్పగించారు. ఇండిగో నుంచి అందిన ఫిర్యాదు మేరకు సదరు ప్రయాణికుడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లు ఎయిర్‌లైన్స్‌ తెలిపింది. అతడు బెయిల్‌పై విడుదలయ్యాడని పోలీసు సీనియర్‌ అధికారి ఒకరు చెప్పారు. మరోవైపు ఈ ఘటనపై ఇండిగో స్పందించింది. వ్యక్తి ప్రవర్తనతో ఇతర ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు ఎయిర్‌లైన్స్‌ తెలిపింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.

Follow us