పాకిస్తాన్ డొల్లతనం మరోసారి బట్టబయలు… ఈసారి మరీ దారుణం !

అంతర్జాతీయ సమాజం ముందు పలుమార్లు పరువు పోగొట్టుకున్న పాకిస్తానుకు ఇంకా బుద్ది రావడం లేదు. కాశ్మీర్ విషయంలో ప్రపంచ దేశాలన్నీ పాకిస్తాన్ వాదనను పట్టించుకోకపోయినా ఇంకా పిచ్చి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. తాజాగా పాకిస్తాన్ పరువు పోయే వ్యవహారం ఒకటి వెలుగు చూసింది. ఉగ్రవాదులను, ఉగ్రవాద సంస్థలను తమ భూభాగంలో పెంచి పోషిస్తూ అంతర్జాయతీయ స్థాయిలో ఎవరి నుంచి సాయం పొందలేని దుస్థితికి చేరుకున్న పాకిస్తాన్.. తమ దేశం ఆర్థికంగా బాగానే ఉంది అన్న మేకపోతు గాభీర్యాన్ని […]

పాకిస్తాన్ డొల్లతనం మరోసారి బట్టబయలు... ఈసారి మరీ దారుణం !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 21, 2019 | 5:38 PM

అంతర్జాతీయ సమాజం ముందు పలుమార్లు పరువు పోగొట్టుకున్న పాకిస్తానుకు ఇంకా బుద్ది రావడం లేదు. కాశ్మీర్ విషయంలో ప్రపంచ దేశాలన్నీ పాకిస్తాన్ వాదనను పట్టించుకోకపోయినా ఇంకా పిచ్చి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. తాజాగా పాకిస్తాన్ పరువు పోయే వ్యవహారం ఒకటి వెలుగు చూసింది. ఉగ్రవాదులను, ఉగ్రవాద సంస్థలను తమ భూభాగంలో పెంచి పోషిస్తూ అంతర్జాయతీయ స్థాయిలో ఎవరి నుంచి సాయం పొందలేని దుస్థితికి చేరుకున్న పాకిస్తాన్.. తమ దేశం ఆర్థికంగా బాగానే ఉంది అన్న మేకపోతు గాభీర్యాన్ని ప్రదర్శిస్తూనే ఉంది. తాజాగా దీనికి సంబంధిచిన వ్యవహారం వెలుగు చూసింది.

పాకిస్తాన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌లైన్స్‌ (పీఐఏ) ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయినట్లు ఒక ఆడిట్‌ నివేదిక వెల్లడించింది. 2016 – 17లో ఇస్లామాబాద్‌ విమానాశ్రయం నుంచి పీఐఏకి చెందిన 46 విమాన సర్వీసులు ప్రయాణికులు లేకుండానే ఖాళీగా తిరిగినట్లు పేర్కొంది. దీనివల్ల ఆ దేశానికి సుమారు రూ.18 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు తెలుస్తుంది. ఈ విషయం సంబంధిత ఎయిర్‌లైన్స్‌ అధికారులకు తెలిసినా ఎటువంటి చర్యలు తీసుకోలేకపోయారు. అంతేగాక హజ్‌, ఉమ్రా ప్రాంతాల్లో కూడా 36 విమానాలు ప్రయాణికులు లేకుండానే ఖాళీగా తిరిగినట్లు నివేదికలో తేలింది. కాగా, కొన్ని నెలల క్రితం నిర్వహణ ఖర్చులు తగ్గించుకునేందుకు పీఐఏ ఎయిర్‌లైన్స్‌ సంస్థ వెయ్యి మంది ఉద్యోగులను తొలగించింది.

ఆర్థికంగా దివాళా తీస్తున్నా, తమ దేశ పౌరులు ఆహారం కోసం, మౌలిక వసతుల కోసం నానా తిప్పలు పడుతున్నా పాకిస్తాన్ తన డంబాచారాన్ని వీడడం లేదు. ఈ ధోరణితో పాకిస్తాన్ పరువు పోగొట్టుకోవడం మినహా సాధించేదేమీ లేదని తెలుస్తోంది.

కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
బంగారం రా మా సాయి పల్లవి.. ఇంత మెచ్యురిటీ ఏంటమ్మా నీకు..
బంగారం రా మా సాయి పల్లవి.. ఇంత మెచ్యురిటీ ఏంటమ్మా నీకు..