Shehbaz Sharif: పాక్ కొత్త ప్రధాని కీలక నిర్ణయాలు.. ప్రధాని మోడీ విషెస్‌కు ధన్యవాదాలు

పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించేందుకు ఆ దేశ కొత్త ప్రధాని షెహబాజ్ షరీఫ్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాల్లో వారంలో ఐదు రోజుల పనిదినాలు అమలులో ఉండగా..

Shehbaz Sharif: పాక్ కొత్త ప్రధాని కీలక నిర్ణయాలు.. ప్రధాని మోడీ విషెస్‌కు ధన్యవాదాలు
Pakistan PM Shehbaz Sharif (File Photo)Image Credit source: TV9 Telugu
Follow us
Janardhan Veluru

|

Updated on: Apr 12, 2022 | 6:26 PM

Pakistan News: పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించేందుకు ఆ దేశ కొత్త ప్రధాని షెహబాజ్ షరీఫ్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాల్లో వారంలో ఐదు రోజుల పనిదినాలు అమలులో ఉండగా.. ఇకపై 6 రోజుల పనిదినాలు అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ఇకపై వారంలో రెండు రోజులు సెలవులు ఉండవోవని.. ఒక అధికారిక వారపు సెలవు మాత్రమే ఉంటుందని ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఆదేశించారు. అలాగే ప్రభుత్వ కార్యాలయాల రోజువారీ పని గంటలను కూడా 10 గంటలకు పెంచుతూ ప్రధాని నిర్ణయం తీసుకున్నట్లు స్థానిక మీడియా మంగళవారం కథనాలు ప్రసారం చేశాయి. ప్రభుత్వ కార్యాలయాలు ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు పనిచేయనున్నాయి.

దేశంలో ద్రవ్యోల్బణం రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో షెహబాబ్ షరీఫ్ ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడం పాకిస్తాన్ కొత్త ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారుతుందని ఆర్థిక నిపుణులు ఇప్పటికే హెచ్చరించారు. అలాగే పాక్ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలంటే ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ప్రకటించిన ఉపశమన చర్యలను వెనక్కి తీసుకోవలసి ఉంటుందని వారు అభిప్రాయపడ్డారు.

ఇదిలా ఉండగా పాకిస్థాన్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా తనకు విషెస్ తెలిపినందుకు షెహబాజ్ షరీఫ్ భారత ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపారు. భారత్‌తో శాంతియుత సంబంధాలను పాకిస్థాన్ కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. జమ్ము కశ్మీర్ సహా అన్ని దీర్ఘకాలిక సమస్యలకు శాంతియుత పరిష్కారాన్ని కోరుకుంటున్నట్లు చెప్పారు. తీవ్రవాదంపై పోరులో పాకిస్థాన్ త్యాగాలు అందరికీ తెలిసిందేనంటూ ప్రధాని మోడీ ట్వీట్‌పై స్పందిస్తూ షెహబాజ్ షరీఫ్ కామెంట్స్ చేశారు.

పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సోదరుడైన షెహబాజ్ షరీఫ్ ఆ దేశ 23వ ప్రధానమంత్రిగా ఆ దేశ జాతీయ అసెంబ్లీ ఎన్నికైన తర్వాత సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై విపక్షాల అవిశ్వాస తీర్మానం గట్టెక్కడంతో ఆయన ప్రధాని పదవిని కోల్పోవడం తెలిసిందే.

Also Read..

Acharya Trailer: మెగాస్టారా మజాకా.. దుమ్మురేపిన చిరు- చరణ్.. అదిరిపోయిన ‘ఆచార్య’ ట్రైలర్..

Andhra Pradesh: ఆంధ్రాలో కరోనా ఆల్మోస్ట్ ఖతం.. కొత్తగా కేవలం 2 అంటే 2 కేసులు.. కంప్లీట్ వివరాలు

వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..