AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పహల్గామ్‌ ఉగ్రదాడి తర్వాత ప్రధాని మోదీతో సీఎం ఒమర్ అబ్దుల్లా తొలి భేటీ

పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారు. ఈ సమావేశంలో జమ్మూ కాశ్మీర్‌లో భద్రతా పరిస్థితి, పర్యాటక భద్రత, ఉగ్రవాద వ్యతిరేక చర్యలపై చర్చించినట్లు భావిస్తున్నారు. ఒమర్ అబ్దుల్లా ఇంతకుముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు, కానీ దాడి తర్వాత ఆయన ప్రధానమంత్రిని కలవడం ఇదే మొదటిసారి.

పహల్గామ్‌ ఉగ్రదాడి తర్వాత ప్రధాని మోదీతో సీఎం ఒమర్ అబ్దుల్లా తొలి భేటీ
Omar Abdullah And Pm Modi Meeting
Balaraju Goud
|

Updated on: May 03, 2025 | 9:18 PM

Share

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత తొలిసారిగా, జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా శనివారం (ఏప్రిల్ 03) ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ప్రధానమంత్రి నివాసంలో జరిగిన ఈ సమావేశం దాదాపు అరగంట పాటు కొనసాగింది. ఉగ్ర దాడి తర్వాత తలెత్తిన పరిస్థితిపై ఇద్దరు నాయకుల మధ్య చర్చించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

సింధు జల ఒప్పందాన్ని నిలిపివేయడం, దాని ప్రభావం గురించి ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా.. ప్రధాని మోదీతో చర్చించారు. ఇది జమ్మూ కాశ్మీర్‌పై అత్యధిక ప్రభావాన్ని చూపుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. పహల్గామ్ దాడుల తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో పరిస్థితి, పర్యాటకుల రాకపోకలు, పర్యాటక పరిశ్రమకు స్థిరీకరణ కోసం జరుగుతున్న ప్రయత్నాలను జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ప్రధానమంత్రికి వివరించారు. ఉగ్రవాదంపై యుద్ధానికి పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలు, మౌలిక సదుపాయాలపై జరిగే దాడులకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి మద్దతు పునరుద్ఘాటించారు.

జమ్మూ కాశ్మీర్‌ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి ముఖ్యమంత్రి ప్రధానమంత్రికి వివరణాత్మక సమాచారాన్ని అందించినట్లు సమాచారం. ఇందులో OGW ల అరెస్టు, దాడులు, స్థానిక సంఘాలతో చర్చలు ఉన్నాయి. లోయలో భద్రత, రాజకీయ స్థిరత్వం గురించి మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్న సమయంలో ఈ సమావేశం జరిగింది. జమ్మూ కాశ్మీర్‌ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి నరేంద్ మోదీల సమావేశం ప్రతీకాత్మకంగా ముఖ్యమైనది మాత్రమే కాదు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సహకారం, సమన్వయాన్ని కూడా ప్రతిబింబిస్తుంది.

జమ్మూ కాశ్మీర్‌లో ఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సహించడం, పర్యాటకాన్ని సురక్షితంగా మార్చడం, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలను పెంచడం వంటి అంశాలపై ఒమర్ అబ్దుల్లా ప్రధానమంత్రితో చర్చించినట్లు తెలుస్తోంది. అయితే, ప్రధానమంత్రితో జరిగిన సమావేశంలో చర్చించిన అంశాలపై ముఖ్యమంత్రి ఇంకా ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. సమావేశం గురించిన సమాచారం మాత్రమే అధికారికంగా ఇవ్వడం జరిగింది.

ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత, జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. కానీ ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలవలేదు. ఉగ్రదాడి జరిగిన 11 రోజుల తర్వాత, ముఖ్యమంత్రి ఢిల్లీ చేరుకుని ప్రధానమంత్రిని కలిశారు. పహల్గామ్ దాడి తర్వాత, జమ్మూ కాశ్మీర్‌లో గట్టి భద్రతా ఏర్పాట్లు ఉన్నాయి. ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు నిర్వహిస్తున్నాయి. జాతీయ దర్యాప్తు సంస్థ దాడిపై దర్యాప్తు చేస్తుండగా సైన్యాన్ని అప్రమత్తం చేశారు. NIA బృందం శ్రీనగర్‌లో మకాం వేస్తోంది. ప్రాథమిక దర్యాప్తు నివేదికను కూడా NIA శనివారం కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు సమర్పించాల్సి ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..