లోక్‌సభ ఎన్నికలకు రెండో దశ ఓటింగ్‌కు ముందు ఆస్తి పంపిణీపై రాజకీయ గందరగోళం మధ్య, వారసత్వ పన్నుపై ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్షుడు శామ్ పిట్రోడా చేసిన ప్రకటనపై రాజకీయ దుమారం చెలరేగుతోంది. ఆయన ప్రకటనపై భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టగా, శామ్ పిట్రోడా ప్రకటనకు కాంగ్రెస్ దూరంగా ఉంది.
“అమెరికాలో, వారసత్వపు పన్ను చట్టం ఉంది. ఎవరైనా 100 మిలియన్ డాలర్ల విలువైన ఆస్తులను కలిగి ఉంటే, అతను చనిపోయినప్పుడు అతని పిల్లలకు 45% మాత్రమే బదిలీ అవుతాయి. ప్రభుత్వం మిగిలిన 55% తీసుకుంటుంది. ఇది ఆసక్తికరమైన చట్టమని సామ్ పిట్రోడా పేర్కొన్నారు. మీరు సంపదను సృష్టించారు, మీ సంపదను ప్రజలకు వదిలివేయాలి, మొత్తం కాదు, సగం, ఇది సముచితమని భావిస్తున్నానని, దానిని పేదలకు పంచుతామని శామ్ పిట్రోడా చెప్పారు.
“భారతదేశంలో ఆ పరిస్థితి లేదని, ఒకరి సంపద రూ. 10 బిలియన్లు, అతను చనిపోతే, అతని పిల్లలకు రూ. 10 బిలియన్లు చెందుతుందని, ప్రజలకు ఏమీ లభించదు. కాబట్టి దీనిపై దేశవ్యాప్తంగా ప్రజలు చర్చించుకోవాల్సిన అవసరముందన్నారు శామ్ పిట్రోడా. సంపద పునర్విభజనపై కొత్త విధానాలు తీసుకురావల్సిన అవసరముందని ఆయన అభిప్రాయపడ్డారు. సంపద కేవలం ధనవంతుల ప్రయోజనాల కోసం మాత్రమే కాదన్నారు.
తాను చేసిన ప్రకటనను సామ్ పిట్రోడా సోషల్ మీడియా వేదికగా సమర్థించకున్నారు. తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో రాశారు. “వాస్తవాలను మాత్రమే ప్రస్తావించానని, వాటి గురించి ప్రజలు చర్చించుకోవాల్సిన అంశాలని చెప్పాను. దీనికి కాంగ్రెస్‌తో సహా ఏ పార్టీ విధానానికి సంబంధం లేదు. 55% తీసేస్తామని ఎవరు చెప్పలేదన్నారు. భారతదేశంలో ఇలాంటివి జరగాలని ఎవరు చెప్పారు? బీజేపీ ఎందుకు భయపడుతున్నాయి? అంటూ శామ్ పిట్రోడా ప్రశ్నించారు.
శామ్ పిట్రోడా వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. కాంగ్రెస్ పార్టీ ప్రమాదకర ఉద్దేశాలు ఒకదాని తర్వాత ఒకటిగా తెరపైకి వస్తున్నాయన్నారు. మధ్యతరగతి ప్రజలపై మరిన్ని పన్నులు విధించాలని రాజకుటుంబానికి చెందిన యువరాజు సలహాదారు కొంతకాలం క్రితం చెప్పారు. ఇప్పుడు ఈ వ్యక్తులు మరో అడుగు ముందుకేశారు. ఇప్పుడు వారసత్వపు పన్ను విధిస్తామని, తల్లిదండ్రుల నుంచి వచ్చే వారసత్వంపై కూడా పన్ను విధిస్తామని కాంగ్రెస్ చెబుతోందని విమర్శించారు.
శాం పిట్రోడా ప్రకటనతో కాంగ్రెస్‌పై బీజేపీ దాడి
శామ్ పిట్రోడా ప్రకటనపై బీజేపీ నేత అమిత్ మాలవీయ స్పందించారు. ‘భారత్‌ను నాశనం చేయాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది. ఇప్పుడు, శామ్ పిట్రోడా సంపదను పునఃపంపిణీ చేయడానికి 50% వారసత్వపు పన్నును సమర్థించారు. అంటే మన కష్టార్జితం, మనం సృష్టించిన వాటిలో 50% తీసివేయాలి. ఇది కాకుండా మనం చెల్లించే పన్ను కూడా కాంగ్రెస్ గెలిస్తే పెరుగుతుందంటూ ధ్వజమెత్తారు మాలవీయ. ఇదే అంశంపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ఘాటు వ్యాఖ్యలు చేశారు. “కుటుంబ సలహాదారులు రహస్యాన్ని వెల్లడిస్తున్నారు. వారి ఉద్దేశ్యం వ్యవస్థీకృత దోపిడీ, కష్టపడి సంపాదించిన డబ్బును చట్టబద్ధంగా దోచుకోవడమే.” అన్నారు హిమంత బిస్వా.
Congress has decided to destroy India. Now, Sam Pitroda advocates 50% inheritance tax for wealth redistribution. This means 50% of whatever we build, with all our hard work and enterprise, will be taken away. 50%, besides all the tax we pay, which too will go up, if the Congress… https://t.co/4ojS3ZtSRL
— Amit Malviya (मोदी का परिवार) (@amitmalviya) April 24, 2024
క్లారిటీ ఇచ్చిన కాంగ్రెస్
శామ్ పిట్రోడా ప్రకటనపై వ్యాఖ్యానించడానికి నిరాకరించిన కాంగ్రెస్ నాయకుడు జైరామ్ రమేష్, “సామ్ పిట్రోడా సహా ప్రపంచవ్యాప్తంగా చాలా మందికి గురువు, స్నేహితుడు, తత్వవేత్త, మార్గదర్శకుడు శామ్ పిట్రోడా. భారతదేశ అభివృద్ధికి ఆయన అసంఖ్యాకమైన, శాశ్వతమైన కృషి చేశారు. అతను ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్షుడు. పిట్రోడా తాను బలంగా భావించే సమస్యలపై బహిరంగంగా తన అభిప్రాయాలను వ్యక్తపరుస్తాడు. ఖచ్చితంగా, ప్రజాస్వామ్యంలో ఒక వ్యక్తి తన వ్యక్తిగత అభిప్రాయాలను చర్చించడానికి, వ్యక్తీకరించడానికి, చర్చించడానికి స్వేచ్ఛ ఉంది. పిట్రోడా అభిప్రాయాలు ఎల్లప్పుడూ భారత జాతీయ కాంగ్రెస్ స్థితిని ప్రతిబింబిస్తాయని దీని అర్థం కాదన్నారు జైరాం రమేష్. ప్రస్తుతం తన వ్యాఖ్యలను రాజకీయం చేయడం సరికాదన్నారు. ఎన్నికల ప్రచారం నుండి దృష్టిని మరల్చడానికి ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న ప్రయత్నం అన్నారు.
Sam Pitroda has been a mentor, friend, philosopher, and guide to many across the world, including me. He has made numerous, enduring contributions to India's developments. He is President of the Indian Overseas Congress.
Mr Pitroda expresses his opinions freely on issues he…
— Jairam Ramesh (@Jairam_Ramesh) April 24, 2024
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..