‘ఆపరేషన్ గోల్డెన్ డాన్’ సక్సెస్ చేశారు అధికారులు. అంతర్జాతీయ బంగారం స్మగ్లింగ్ రాకెట్‌ను పట్టుకోవడంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డిఆర్‌ఐ) అధికారులు విజయం సాధించారు.”ఆపరేషన్ గోల్డెన్ డాన్” పేరుతో పాన్ ఇండియా ఆపరేషన్ చేపట్టారు. డీఆర్‌ఐ ఆపరేషన్‌లో రూ.1.35 కోట్లకు పైగా విలువైన భారతీయ, విదేశీ కరెన్సీ నోట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో ఏడుగురు సూడాన్ జాతీయులతో సహా 10 మంది ముఠా సభ్యులను అరెస్టు చేశారు. నిందితుల్లో ముగ్గురు భారతదేశానికి చెందినవారిగా గుర్తించారు. పట్టుబడిన సైఫ్ సయ్యద్ ఖాన్, షంషేర్ ఖాన్, మనీష్ ప్రకాష్ జైన్ లను భారతీయులుగా గుర్తించారు. మిగిలిన వారిని సూడాన్ జాతీయులుగా గుర్తించారు.
డీఆర్‌ఐ ఆపరేషన్‌లో రూ.1.35 కోట్లకు పైగా విలువైన భారతీయ, విదేశీ కరెన్సీ నోట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బంగారాన్ని ఎక్కువగా పేస్ట్ రూపంలో స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. దీనిని ఇండో-నేపాల్ సరిహద్దు ద్వారా పాట్నాకు తీసుకొచ్చారు. దీని తర్వాత రైళ్లలో లేదా విమానంలో దేశంలోని వివిధ ప్రాంతాలకు పంపించారు. పెద్ద ఎత్తున ముంబైకి తీసుకెళ్లారు. 35 కోట్లకు పైగా విలువైన భారతీయ, విదేశీ కరెన్సీ నోట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బంగారాన్ని ఎక్కువగా పేస్ట్ రూపంలో స్వాధీనం చేసుకున్నట్లు అధికారి తెలిపారు. దీనిని ఇండో-నేపాల్ సరిహద్దు ద్వారా పాట్నాకు తీసుకొచ్చారు. దీని తర్వాత రైళ్లలో లేదా విమానంలో దేశంలోని వివిధ ప్రాంతాలకు పంపించారు. పెద్ద ఎత్తున ముంబైకి తరలించినట్టుగా గుర్తించారు. ఆదివారం అర్థరాత్రి ముగ్గురు సూడాన్ జాతీయులను అధికారులు పట్టుకున్నారు. పాట్నా రైల్వే స్టేషన్‌లో ముంబై వెళ్లే రైలు ఎక్కుతుండగా అదుపులోకి తీసుకున్నారు. బంగారం పేస్ట్‌లో 37.126 కిలోల బంగారం ఉన్నట్లు అధికారి తెలిపారు. దానిని 40 ప్యాకెట్లలో దాచి ఉంచారు. స్లీవ్‌లెస్ జాకెట్‌తో ప్రత్యేకంగా తయారు చేసిన జేబులో దాచిపెట్టిన ఇద్దరు సూడాన్ జాతీయుల నుంచి బంగారం పేస్ట్‌ని స్వాధీనం చేసుకున్నారు.
ఇందులో భాగంగా పూణెలో మరో ఇద్దరు మహిళలను కూడా అరెస్ట్ చేశారు. 5.615 కిలోల స్మగ్లింగ్ బంగారంతో హైదరాబాద్ నుంచి ముంబైకి బస్సులో వెళుతుండగా సూడాన్ మహిళలు పూణెలో పట్టుబడ్డారు. బంగారాన్ని పసుపు రంగులో పేస్ట్ రూపంలో ఉండి హ్యాండ్‌బ్యాగ్‌లో దాచి ఉంచారు. 615 కిలోల స్మగ్లింగ్ బంగారంతో ఆమె హైదరాబాద్ నుంచి ముంబైకి బస్సులో బయల్దేరారు.
In a pan India operation DRI has busted a gold smuggling syndicate of Sudanese nationals operating through Nepal border. DRI in different interceptions in Patna, Pune & Mumbai seized a total of 101.7 kg of smuggled gold valued Rs. 51 Crore.
Read more ? https://t.co/25JF7GGxS9 pic.twitter.com/zWLfu0eD1W
— CBIC (@cbic_india) February 21, 2023
ముంబై రైల్వే స్టేషన్‌లో ఇద్దరు సూడాన్ దేశస్థులను అరెస్టు చేశారు. వారి నుంచి 40 ప్యాకెట్లలో దాచిన 38.76 కిలోల బంగారం, బంగారు ముద్దను స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా డీఆర్‌ఐ రూ.51 కోట్ల విలువైన 101.7 కిలోల బంగారం, రూ.74 లక్షల విలువైన విదేశీ కరెన్సీ, రూ.63 లక్షల విలువైన భారతీయ కరెన్సీని స్వాధీనం చేసుకుంది. తదుపరి విచారణ కొనసాగుతోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..