Onion Price: అక్కడ కేజీ ఉల్లిపాయలు 60పైసలు.. గిట్టుబాటు ధర లేదంటూ అన్నదాత కన్నీరు..

|

May 20, 2023 | 10:16 AM

ఉల్లి పండించే రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం తమని ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. లేకుంటే తాము రోడ్డుమీద ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నారు. అదే సమయంలో వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు చేసి వ్యవసాయం చేస్తున్న పలువురు రైతులు ఉల్లి ధర పతనం కావడంతో అప్పుల ఊబిలో కూరుకుపోయారు . 

Onion Price: అక్కడ కేజీ ఉల్లిపాయలు 60పైసలు.. గిట్టుబాటు ధర లేదంటూ అన్నదాత కన్నీరు..
Onion Price
Follow us on

కొన్ని ప్రాంతాల్లో ఉల్లిరైతులు సరైన ధర లేక కన్నీరు పెడుతున్నారు. మధ్యప్రదేశ్‌లోని మండీలలో ఉల్లి పరిస్థితి దారుణంగా ఉంది. గిట్టుబాటు ధర కూడా రాకపోవడంతో ఉల్లి పండించే రైతులు కన్నీరు పెడుతున్నారు. గిట్టుబాటు ధర లేదంటూ ఉల్లిని వీధి పాలు చేస్తున్నారు రైతులు. ఉల్లి పండించే రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం తమని ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. లేకుంటే తాము రోడ్డుమీద ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నారు. అదే సమయంలో వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు చేసి వ్యవసాయం చేస్తున్న పలువురు రైతులు ఉల్లి ధర పతనం కావడంతో అప్పుల ఊబిలో కూరుకుపోయారు .

దైనిక్ భాస్కర్ నివేదిక ప్రకారం, మందసౌర్ జిల్లా మార్కెట్‌లో ఉల్లి ధర 1 రూపాయల కంటే తక్కువగా ఉంది.  మంగళవారం మార్కెట్‌లో కిలో ఉల్లి 60 పైసలు పలికింది. అదే విధంగా బుధవారం ఉల్లి ధర 20 పైసలు పెరిగి.. రూ.80 పైసలకు చేరుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు తమకు కనీసం రవాణా ఖర్చులు కూడా రావడం లేదంటూ మార్కెట్‌లోనే ఉల్లిని పారవేస్తున్నారు. పశువులకు ఆహారంగా ఉల్లిని వేస్తున్నారు. అదే సమయంలో బాటసారులు కూడా రోడ్డుమీద ఉన్న ఉల్లిపాయలు తీసుకెళ్తున్నారు.

ఉల్లి కనీస ధర క్వింటాల్‌కు రూ.80 

ఇవి కూడా చదవండి

రేటు తగ్గడంతో మార్కెట్‌కు ఉల్లి రాక కూడా తగ్గింది. బుధవారం కేవలం 1733 బస్తాల ఉల్లి వచ్చింది. ఉల్లి కనీస ధర క్వింటాల్‌కు రూ.80గా నమోదైంది. మార్కెట్‌లో గరిష్టంగా క్వింటాల్‌కు రూ.930గా నమోదైంది. ఈ విధంగా బుధవారం కనిష్టంగా కిలో ఉల్లి 80 పైసలు పలికిందని చెప్పొచ్చు. దీంతో రైతులు ఆగ్రహించి ఉల్లిని మార్కెట్‌లోనే విసిరివేశారు. ఉల్లి కనీస ధర ఇంత తక్కువగా ఉంటుందని ఊహించలేదని రైతు సోహన్ సింగ్ వాపోతున్నాడు.

500 ఎకరాల్లో దెబ్బతిన్న ఉల్లి పంట 

మరోవైపు మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో వర్షం, వడగళ్ల వానలు ఉల్లిని పండించే రైతుల వెన్ను విరిచాయి. అకాల వర్షం, వడగళ్ల వాన కారణంగా పొలంలో వేసిన ఉల్లి పంట నేలకొరిగింది. జిల్లాలోని బందెవాడి గ్రామంలో వర్షం కారణంగా 500 ఎకరాల్లో ఉల్లి పంటకు నష్టం వాటిల్లినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.  దాదాపు 100 మంది రైతులు ఆర్థికంగా నష్టపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..