Jammu Encounter: జమ్మూలో ఉగ్రవాదుల కాల్పులు.. ఒక జవాన్ మృతి..నలుగురికి గాయాలు.. కొనసాగుతున్న కూంబింగ్

Jammu Encounter: ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) జమ్మూ కాశ్మీర్‌లో పర్యటనకు ముందు సుంజ్వాన్ (Sunjwan) ప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది..

Jammu Encounter: జమ్మూలో ఉగ్రవాదుల కాల్పులు.. ఒక జవాన్ మృతి..నలుగురికి గాయాలు.. కొనసాగుతున్న కూంబింగ్
Jammu And Kashmir

Updated on: Apr 22, 2022 | 8:31 AM

Jammu Encounter: ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) జమ్మూ కాశ్మీర్‌లో పర్యటనకు ముందు సుంజ్వాన్ (Sunjwan)  ప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. జమ్మూ శివార్లలోని ఆర్మీ క్యాంపు సమీపంలో జరిగిన కాల్పుల్లో ఒక భద్రతా దళ సిబ్బంది మరణించగా, మరో నలుగురు గాయపడినట్లు అధికారులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే..

పాకిస్థాన్‌కు చెందిన జైష్-ఏ-మహ్మద్ (జేఎం) సంస్థకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు సుంజ్వాన్ ప్రాంతంలో తలదాచుకున్నారనే సమాచారంతో భద్రతాదళాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. స్థానికంగా ఉన్న ఓ ఇంట్లో విదేశీ ఉగ్ర‌వాదులు ఉన్న‌ట్లు సైన్యం గుర్తించింది. ఉగ్ర‌వాదుల కోసం బ‌ల‌గాలు కూంబింగ్ ప్రారంభించాయి. దీంతో ఉగ్రవాదులు..జవాన్లపై కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఒక జవాన్ వీరమరణం పొందగా, నలుగురు జవాన్లు గాయపడ్డారు.

ఇదే విషయంపై జమ్మూ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ముఖేష్ సింగ్ మాట్లాడుతూ, పోలీసు స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ ,  CRPF దళాలు ఈ ప్రాంతంలో సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టిందని అన్నారు. కూబింగ్ సమయంలో భద్రదళాలు ఉగ్రవాదుల మాధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయని. అయితే జమ్మూలోని సాంబా జిల్లాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  ఏప్రిల్ 24, 2022న పర్యటించాల్సి ఉంది.

మరోవైపు ఉత్తర కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో గత 22 గంటల నుంచి కూబింగ్ కొనసాగుతోంది. ఈ ఎన్‌కౌంటర్‌లో భద్రతా బలగాలు ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చాయి, ఇందులో టాప్ లెఇటి కమాండర్ కూడా ఉన్నారు. కార్డన్‌లో మరో ఇద్దరు ఉగ్రవాదులు చిక్కుకున్నట్లు తెలుస్తోంది.

Also Read: Viral Video: సంగీత్‌ ఫంక్షన్‌లో డాన్స్‌ అదరగొట్టిన నవ వధువు..! అదిరిపోయే స్టెప్పులకు కామెంట్లతో ఆశీర్వచనాలు

Petrol Diesel Price Today: తెలంగాణాలో స్థిరంగా, ఏపీలో స్వల్పంగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో ఎలా ఉన్నాయంటే..