Petrol Diesel Price Today: తెలంగాణాలో స్థిరంగా, ఏపీలో స్వల్పంగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో ఎలా ఉన్నాయంటే..
Petrol Diesel Price Today: మన దేశంలో ఇంధన ధరలు రోజు రోజుకీ పెరుగుతూ.. ఆల్ టైం గరిష్ఠానికి చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే కేంద్రం ఎక్సైజ్ సుంకం తగ్గింపుతో పెట్రోల్, డీజిల్ కొంతమేర..
Petrol Diesel Price Today: మన దేశంలో ఇంధన ధరలు రోజు రోజుకీ పెరుగుతూ.. ఆల్ టైం గరిష్ఠానికి చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే కేంద్రం ఎక్సైజ్ సుంకం తగ్గింపుతో పెట్రోల్, డీజిల్ కొంతమేర దిగివచ్చాయి. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా పదహారో రోజు స్థిరంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం, ఏప్రిల్ 22వ తేదీన ధరల్లో ఎలాంటి మార్పులేదు. చివరిసారిగా ఏప్రిల్ 6వ తేదీన లీటర్ పెట్రోల్ పైన 80 పైసలు పెరిగింది. మార్చి 22వ తేదీ నుండి పెరుగుదల ప్రారంభమైంది. మొత్తం రూ.10 వరకు పెరిగింది. ఇటీవల స్థిరంగా ఉంది. ఈ నేపథ్యంలో ఆంధప్రదేశ్(Andhrapradesh), తెలంగాణ(Telangana) రాష్ట్రాలతో సహా దేశంలో ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరల వివరాలను తెలుసుకుందాం..
తెలంగాణ: హైదరాబాద్‌లో పెట్రోల్ డీజిల్ ధరలు పది రోజులకు పైగా నిలకడగా ఉన్నాయి.హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.119.49, డీజిల్ రూ.105.49 వద్ద ఉంది. ఆంధ్రప్రదేశ్: విజయవాడ లో పెట్రోల్ ధర నేడు రూ.0.35 పైసలు తగ్గి రూ.121.21గా ఉంది. డీజిల్ ధర రూ.0.32 పైసలు తగ్గి రూ.106.80 గా ఉంది. అయితే మరో ప్రధాన నగరమైన విశాఖపట్నంలో పెట్రోల్ ధర స్వల్పంగా పెరిగింది. నేడు లీటరు ధర రూ.0.24 పైసలు పెరిగి రూ.120.24 గా ఉంది. డీజిల్ ధర కూడా స్వల్పంగా రూ.0.22 పైసలు పెరిగి రూ.105.87గా కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.105.41, లీటర్ డీజిల్ ధర రూ.96.67 వద్ద ఉంది. దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.120.51, డీజిల్ రూ.104.77 ఉంది. మరో ప్రధాన నగరమైన చెన్నైలో పెట్రోల్ రూ.110.85, డీజిల్ రూ.100.94లు ఉంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు సెంచరీని క్రాస్ చేశాయి.
అయితే పెట్రోల్, డీజిల్ ధరలు అంతర్జాతీయ పరిణామాల పై ఆధారపడి హెచ్చుతగ్గులు ఉంటాయి. తాజాగా ఉక్రెయిన్ – రష్యా యుద్ధ ప్రభావంకూడా దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభావం చూపిస్తోంది. గతేడాది ఏప్రిల్‌లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం తగ్గలేదు. పైగా పెరుగుతూ వస్తున్నాయి.