Manipur Violence: గుండెల్ని పిండేసిన మణిపుర్ ఘటన.. అసలు జరిగిన స్టోరీ ఇదే

మణిపూర్‌లో ఇద్దరు మహిళల్ని నగ్నంగా ఊరేగించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. చాలామంది ఈ ఘటనపై విమర్శలు చేశారు. నిందుతులను కఠినంగా శిక్షించాలని.. మణిపుర్ సమస్యను పరిష్కరించాలని ప్రజలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

Manipur Violence: గుండెల్ని పిండేసిన మణిపుర్ ఘటన.. అసలు జరిగిన స్టోరీ ఇదే
Manipur

Updated on: Jul 21, 2023 | 7:38 AM

మణిపుర్‌లో ఇద్దరు మహిళల్ని నగ్నంగా ఊరేగించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. చాలామంది ఈ ఘటనపై విమర్శలు చేశారు. నిందుతులను కఠినంగా శిక్షించాలని.. మణిపుర్ సమస్యను పరిష్కరించాలని ప్రజలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇద్దరు మహిళల్ని నగ్నంగా ఊరేగించిన ఘటనకు సంబంధించిన వ్యవహారం బయటపడింది. వివరాల్లోకి వెళ్తే.. మే 3 న మణిపుర్‌లో మెయితీలు, కూకీల మధ్య హింస చెలరేగిన సంగతి తెలిసిందే. అయితే మెయితీ వర్గానికి చెందిన ఓ మహిళపై అత్యాచారం చేశారన్న ఆరోపణలు రావడంతో కుకీ జాతికి చెందిన గ్రామాలపై మెయితీలు దాడులు చేశారు. ఈ క్రమంలోనే తమ ఊరికి కూడా మెయితీల గుంపు దాడులు చేస్తుందనే భయంతో మే 4 వ తేదిన బీ.ఫయనోమ్ గ్రామంలోని కుకీ తెగకు చెందిన ముగ్గరు మహిళలు, ఇద్దరు పురుషులు సురక్షిత ప్రాంతానికి పారిపోయేందుకు యత్నించారు.

వీరిలో ఓ 50 ఏళ్ల వ్యక్తి, అతని కుమారుడు (19), కుమార్తె (21).. మరో ఇద్దరు ఇతర మహిళలు ఉన్నారు. అయితే వీళ్లు అలా పారిపోతుండగా నాంగ్‌పోక్ సెక్మై పోలీస్ స్టేషన్‌కు చెందిన పోలీసులు కనిపించారు. దీంతో వాళ్ల దగ్గరికి వెళ్లారు. కానీ అదే సమయానికి దాదాపు 800 నుంచి వెయ్యి మంది దాకా మెయితీ తెగకు చెందిన భారీ గుంపు అక్కడికి వచ్చి ఆ ఐదుగురిని అడ్డుకున్నారు. ఆ తర్వాత పోలీసులు దగ్గర ఉన్న ఆయుధాలు కూడా లాక్కుని వాళ్లపై దాడులు చేశారు. ఇందులో 19 ఏళ్ల యువకుడు తన సోదరిని కాపాడేందుకు ప్రయత్నించాడు. కానీ ఈ మూకల దాడిలో ఆ యువకుడితో పాటు అతని తండ్రి అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

ఆ తర్వాత 21 ఏళ్ల అమ్మాయితో పాటు మరో మహిళను నగ్నంగా ఊరేగిస్తూ దగ్గర్లోని పొలాలకు తీసుకెళ్లారు. మరో మహిళ తప్పించుకున్నట్లు సమాచారం. అయితే ఆ ఇద్దరు మహిళల్ని నగ్నంగా తీసుకొస్తుండగా కొందరు యువకులు వాళ్ల శరీర భాగాలను చేతిలతో తడుముతూ అసభ్యంగా ప్రవర్తించారు. అనంతరం ఆ మహిళలపై సామూహిక అత్యాచారం చేసి విడిచిపెట్టారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా మే 18న జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇదిలా ఉండగా మణిపుర్‌లో మే 3 నుంచి ఇంటర్నేట్‌పై నిషేధం విధించారు. అందుకే ఈ ఘటన జరిగి రెండు నెలలు దాటినా ఈ వీడియో బయటకి రాలేదు. అయితే ఈ ఘటనకు సంబంధించి ప్రధాన నిందుతుడు ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు.