Omicron: దేశంలో భారీగా విస్తరిస్తున్న ఒమిక్రాన్.. 3 వేలు దాటిన కేసుల సంఖ్య

Omicron cases in India: దేశంలో కరోనా కేసులతోపాటు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అలజడి రేపుతోంది. కరోనాతోపాటు ఒమిక్రాన్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటివరకు దేశంలో

Omicron: దేశంలో భారీగా విస్తరిస్తున్న ఒమిక్రాన్.. 3 వేలు దాటిన కేసుల సంఖ్య
Omicron

Updated on: Jan 07, 2022 | 11:23 AM

Omicron cases in India: దేశంలో కరోనా కేసులతోపాటు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అలజడి రేపుతోంది. కరోనాతోపాటు ఒమిక్రాన్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటివరకు దేశంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 3,007 కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్‌ను శుక్రవారం ఉదయం విడుదల చేసింది. కాగా.. ఇప్పటివరకు నమోదైన ఒమిక్రాన్ కేసుల్లో.. అత్యధికంగా మహారాష్ట్రలో 876 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత ఢిల్లీలో 465, కర్ణాటకలో 333, రాజస్థాన్‌లో 291, కేరళలో 284, గుజరాత్‌లో 204, తమిళనాడులో 121 కేసులు, హర్యానాలో 114, తెలంగాణలో 107, ఒడిశాలో 60, ఉత్తరప్రదేశ్‌లో 31, ఆంధ్రప్రదేశ్‌లో 28, పశ్చిమ బెంగాల్‌లో 27 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

కాగా.. ఇప్పటివరకు ఒమిక్రాన్ బారి నుంచి 1,199 మంది కోలుకున్నట్లు తెలిపింది. అయితే.. రానున్న కాలంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య భారీగా పెరిగే అవకాశమున్నట్లు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో చర్యలు తీసుకోవాలని కేంద్రం రాష్ట్రాలకు సూచిస్తోంది.

Also Read:

India Coronavirus: దేశంలో కరోనా అల్లకల్లోలం.. లక్ష మార్క్ దాటేసిన కొత్త కేసులు..

Encounter: జమ్మూకశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదుల హతం..