టాలీవుడ్‌లో మళ్లీ తెరపైకి డ్రగ్స్ కేసు

మూడేళ్ల క్రితం టాలీవుడ్‌ ని ఓ కుదుపు కుదిపేసిన డ్రగ్స్‌ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. సమాచార హక్కు చట్టంతో ఆ కేసుకు సంబంధించిన కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. అసలు ఈ డ్రగ్స్‌ కేసు విచారణ ఎంత వరకు వచ్చింది?

టాలీవుడ్‌లో మళ్లీ తెరపైకి డ్రగ్స్ కేసు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Sanjay Kasula

Updated on: Sep 23, 2020 | 10:54 AM

టాలీవుడ్‌ ని ఓ కుదుపు కుదిపేసిన డ్రగ్స్‌ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. టాలీవుడ్‌లో డ్రగ్స్ వ్యవహారం మూడేళ్ల క్రితమే బయటపడింది. అప్పట్లో వరసపెట్టి మరీ సినీ సెలబ్రిటీలను రోజుల తరబడి విచారించారు. దర్యాప్తులో చాలా దూకుడుగా వ్యవహరించారు. ఆ తర్వాత ఒక్కసారిగా ఆ దూకుడు తగ్గిపోయింది. కేసు అటకెక్కినట్లే కన్పించింది. కానీ ఇప్పుడు సమాచార హక్కు చట్టంతో ఆ కేసుకు సంబంధించి కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. మొత్తం 72 మంది పేర్లు వెలుగులోకి వచ్చాయి. అసలు ఈ డ్రగ్స్‌ విచారణ ఎంత వరకు వచ్చింది ?

బాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు షేక్‌ చేస్తోంది. ఈ సందర్భంలో మరోసారి టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు కూడా తెరపైకి వచ్చింది. టాలీవుడ్‌లో డ్రగ్స్‌ కేసు సృష్టించిన కలకలం అంతా ఇంతా కాదు. టాప్‌ డైరెక్టర్లు, హీరోయిన్లు, కెమెరామెన్స్‌ ఇలా అనేక డిపార్ట్‌మెంట్స్‌కు చెందిన హేమాహేమీలకు డ్రగ్స్‌ మరక అంటుకుంది. అప్పట్లో ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు లోతుగానే విచారణ జరిపి కీలక సమాచారం సేకరించారు. దర్యాప్తు పేరుతో కొన్నాళ్ల పాటు సిట్‌ హడావుడి చేసింది. ఆ తర్వాత అంతా గప్‌చుప్‌ అయిపోయారు. ఈ దెబ్బకు టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు మరుగున పడిపోయింది. ఇటీవల ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్ ఆర్టీఐ చట్టం ద్వారా ఆనాటి డ్రగ్స్‌ కేసు ఎక్కడి వరకు వచ్చిందనే వివరాలు సేకరించారు. అందులో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి.

టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసును పూర్తి స్థాయిలో విచారించిన ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌ గడిచిన రెండేళ్లలో మొత్తం 12 కేసులు నమోదు చేసింది. ఈ 12 కేసుల్లో కేవలం 8 కేసుల్లో మాత్రమే ఛార్జిషీట్‌ ఫైల్‌ చేశారు. మిగిలిన 4 కేసుల్లో ఇప్పటికీ ఛార్జిషీట్‌ నమోదు కాకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఆ నాలుగు కేసుల్లో ఎందుకింత ఆలస్యం చేస్తున్నారు ? అసలు ఈ డ్రగ్స్‌ కేసులో అవే కీలకమైనవా ? ఆ కేసుల్లో పెద్దల గుట్టు దాగుందా ? ఇలా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

డ్రగ్స్‌ కేసులో మొత్తం 62 మందికి నోటీసులు ఇచ్చి వారిని సమగ్రంగా విచారించారు. వారి నుంచి రాబట్టిన సమాచారంతో కీలక ఆధారాలు సేకరించారు. అయితే.. ఛార్జిషీట్స్‌లో డ్రగ్‌ పెడ్లర్లు, స్టూడెంట్స్‌ పేర్లు మాత్రమే నమోదు చేసిన ఎక్సైజ్‌ శాఖ సినీ ప్రముఖులను మాత్రం వదిలేసింది. ఎనిమిది ఛార్జిషీట్స్‌లో ఎక్కడా టాలీవుడ్‌ ప్రముఖుల పేర్లు లేకపోవడం ఆసక్తికరం. మరోవైపు 8 కేసుల్లో నమోదైన ఛార్జిషీట్స్‌లో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. టాలీవుడ్‌ డ్రగ్స్‌ లింకులు హైదరాబాద్‌ను దాటేసి ఇతర దేశాలకు విస్తరించాయి. జర్మనీ, బ్రిటన్‌, ఇంగ్లండ్‌ నుంచి కొరియర్‌ ద్వారా డ్రగ్స్‌ను దిగుమతి చేసుకున్నట్టు ఛార్జిషీట్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. డ్రగ్స్‌ కోసం ఏకంగా ఆన్‌లైన్‌ వెబ్‌సైట్స్‌ సైతం క్రియేట్‌ చేశారు స్మగ్లర్స్‌. పలు వెబ్‌సైట్స్‌ ద్వారా డ్రగ్స్‌ కోసం ఆర్డర్లు బుక్‌ చేసుకొని, కొరియర్‌లో వాటిని సరఫరా చేసినట్టు తేల్చారు. స్టీల్‌ గిన్నెల పేరుతో డ్రగ్స్‌ను కొరియర్‌ చేసినట్టు గుర్తించారు.

టాలీవుడ్‌ సెలబ్రిటీలతో పాటు హైదరాబాద్‌కు చెందిన విద్యార్థులు సైతం పెద్ద ఎత్తున డ్రగ్స్‌ తీసుకున్నట్లు ఎక్సైజ్‌ శాఖ విచారణలో తేలింది. మోండా మార్కెట్‌లోని ఓ మెడికల్‌ షాప్‌లోనూ డ్రగ్స్‌ అమ్మినట్టు ఛార్జిషీట్‌లో పేర్కొన్నారు. ఫోరం ఫర్‌ గుడ్ గవర్నెన్స్‌ ఆర్టీఐ ద్వారా సేకరించిన సమాచారంలో ఈ వివరాలన్నీ ఉన్నాయి.

అయితే ఎనిమిది ఛార్జిషీట్స్‌లో ఎక్కడా సినీ ప్రముఖుల పేర్లు లేకపోవడంపై వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కావాలనే సినీ స్టార్స్‌ను డ్రగ్స్ కేసు నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నారని ఫోరమ్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ ప్రతినిధులు తప్పుపడుతున్నారు.

మరోవైపు బాలీవుడ్‌లో వెలుగుచూసిన డ్రగ్స్‌ కేసులోనూ టాలీవుడ్‌ సెలబ్రిటీల పేర్లు ఒక్కక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇక్కడి స్టార్లకు అక్కడి వారితో బలమైన సంబంధాలే ఉన్నాయి. దీంతో ఈ కేసును విచారిస్తున్న అక్కడ ఎన్‌సీబీ అధికారులు ఇక్కడి ఎన్‌సీబీ అధికారులతో మాట్లాడుతున్నారు. గత కేసులకు సంబంధించిన డీటేల్స్‌ కూడా చెక్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం పాత కేసు తేలకముందే ఇప్పుడు కొత్త డ్రగ్స్‌ కేసులో కొత్త కొత్త పేర్లు బయటకొచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి.

అతిపెద్ద ఆటో షోకు వేదికైన ఢిల్లీ.. టాప్ కంపెనీల క్యూ
అతిపెద్ద ఆటో షోకు వేదికైన ఢిల్లీ.. టాప్ కంపెనీల క్యూ
ప్రపంచంలోనే 3వ అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టంగా భారత్.. కేంద్రం
ప్రపంచంలోనే 3వ అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టంగా భారత్.. కేంద్రం
అరంగేట్రంలో 5 వికెట్లతో ఊచకోత.. కట్ చేస్తే.. ఆర్‌సీబీలోకి ఎంట్రీ
అరంగేట్రంలో 5 వికెట్లతో ఊచకోత.. కట్ చేస్తే.. ఆర్‌సీబీలోకి ఎంట్రీ
నేను లోకల్, హలో గురు ప్రేమ కోసమే సినిమాలు నేను చేయాల్సినవి..
నేను లోకల్, హలో గురు ప్రేమ కోసమే సినిమాలు నేను చేయాల్సినవి..
ప్రతిరోజూ షేవింగ్ చేసుకుంటున్నారా.. ఈ విషయాలు మీ కోసమే!
ప్రతిరోజూ షేవింగ్ చేసుకుంటున్నారా.. ఈ విషయాలు మీ కోసమే!
పెట్టుబడితో ఆదాయపు పన్ను ఆదా.. టాప్ స్కీమ్స్ ఇవే..!
పెట్టుబడితో ఆదాయపు పన్ను ఆదా.. టాప్ స్కీమ్స్ ఇవే..!
ఏటీఎంలో డబ్బులు నింపేందుకు వచ్చిన సిబ్బందిపై కాల్పులు జరిపి...
ఏటీఎంలో డబ్బులు నింపేందుకు వచ్చిన సిబ్బందిపై కాల్పులు జరిపి...
టీమిండియా బ్యాటింగ్ కోచ్‌గా నేను రెడీ: మాజీ ప్లేయర్
టీమిండియా బ్యాటింగ్ కోచ్‌గా నేను రెడీ: మాజీ ప్లేయర్
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. కేబినెట్ ఆమోదం!
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. కేబినెట్ ఆమోదం!
పాన్ కార్డు అప్‌డేట్ పేరుతో కొంప ముంచేస్తున్నారు..!
పాన్ కార్డు అప్‌డేట్ పేరుతో కొంప ముంచేస్తున్నారు..!
ఏటీఎంలో డబ్బులు నింపేందుకు వచ్చిన సిబ్బందిపై కాల్పులు జరిపి...
ఏటీఎంలో డబ్బులు నింపేందుకు వచ్చిన సిబ్బందిపై కాల్పులు జరిపి...
ఏందిరా ఇది.. అనౌన్స్‌మెంట్ టీజరే ఇలా ఉంటే మరి సినిమా?
ఏందిరా ఇది.. అనౌన్స్‌మెంట్ టీజరే ఇలా ఉంటే మరి సినిమా?
50 సెకండ్ల షూట్‌కు రూ.5 కోట్ల ఫీజు.. డబ్బుల దగ్గర నో కథల్‌
50 సెకండ్ల షూట్‌కు రూ.5 కోట్ల ఫీజు.. డబ్బుల దగ్గర నో కథల్‌
వెంకీ సినిమాకు నెవ్వర్ బిఫోర్ ఓపెనింగ్స్
వెంకీ సినిమాకు నెవ్వర్ బిఫోర్ ఓపెనింగ్స్
గ్లామర్, సెలబ్రిటీ హోదా.. అన్నింటినీ వదిలి సాధ్విగా కుంభమేళాలో..
గ్లామర్, సెలబ్రిటీ హోదా.. అన్నింటినీ వదిలి సాధ్విగా కుంభమేళాలో..
గేమ్‌ ఛేంజర్‌ గురించి అవాక్కయ్యేలా మాట్లాడిన జానీ మాస్టర్ కొడుకు
గేమ్‌ ఛేంజర్‌ గురించి అవాక్కయ్యేలా మాట్లాడిన జానీ మాస్టర్ కొడుకు
ప్రతి రోజు సమాధులకు నీళ్లు పోస్తున్న యువకుడు.. వెళ్లి చూడగా
ప్రతి రోజు సమాధులకు నీళ్లు పోస్తున్న యువకుడు.. వెళ్లి చూడగా
బిడ్డను రైల్లోనే వదిలి పాలకోసం ట్రైన్‌ దిగిన తల్లి.. ఇంతలోనే..
బిడ్డను రైల్లోనే వదిలి పాలకోసం ట్రైన్‌ దిగిన తల్లి.. ఇంతలోనే..
కాళ్లు, మూతులు కుట్టి.. 40 అడుగుల బ్రిడ్జ్ పై నుంచి విసిరేసి..
కాళ్లు, మూతులు కుట్టి.. 40 అడుగుల బ్రిడ్జ్ పై నుంచి విసిరేసి..
ఫేస్ బుక్ ఖాతాలు డిలీట్ చేస్తున్న యూజర్లు.. ఎందుకంటే ??
ఫేస్ బుక్ ఖాతాలు డిలీట్ చేస్తున్న యూజర్లు.. ఎందుకంటే ??