ప్రధాని మోదీ విదేశీ పర్యటనల ఖర్చు రూ. 515 కోట్లు !
2015 నుంచి ప్రధాని మోదీ విదేశీ పర్యటనలకు రూ. 515 కోట్లు ఖర్చయిందని ప్రభుత్వం లోక్ సభకు తెలిపింది. ఆయన మొత్తం 58 దేశాలను సందర్శించినట్టు వెల్లడించింది. చివరగా గత నవంబరులో బ్రెజిల్ ను విజిట్ చేశారని...
2015 నుంచి ప్రధాని మోదీ విదేశీ పర్యటనలకు రూ. 515 కోట్లు ఖర్చయిందని ప్రభుత్వం లోక్ సభకు తెలిపింది. ఆయన మొత్తం 58 దేశాలను సందర్శించినట్టు వెల్లడించింది. చివరగా గత నవంబరులో బ్రెజిల్ ను విజిట్ చేశారని కేంద్ర మంత్రి మురళీధరన్ ఓ లిఖిత పూర్వక సమాధానంలో తెలిపారు. మోడీ ఎక్కువగా అమెరికా, రష్యా దేశాలను అయిదేసి సార్లు సందర్శించారని, ఆయా దేశాల పర్యటనలవల్ల ఇండియాకు వాటితో ద్వైపాక్షిక సంబంధాలు చాలావరకు పెంపొందాయన్నారు. ప్రధాని సింగపూర్, ఫ్రాన్స్, యూఏఈ, శ్రీలంక, జర్మనీ తదితర దేశాలను విజిట్ చేసినట్టు మురళీధరన్ పేర్కొన్నారు. అయితే కరోనావైరస్ పాండమిక్ నేపథ్యంలో ఈ ఏడాది ఏ దేశాన్నీ మోదీ సందర్శించలేదన్నారు.