Odisha Train Accident: బాలాసోర్‌ ప్రమాద స్థలంలో ట్రాక్‌ పునరుద్ధరణ పూర్తి.. రైళ్లకు రూట్‌ క్లియర్‌.. నడిచిన గూడ్స్‌ రైలు

| Edited By: Narender Vaitla

Jun 05, 2023 | 8:12 AM

ఒడిశా రాష్ట్రంలో బాలాసోర్‌ దగ్గర జరిగిన రైలుప్రమాదం.. దేశాన్ని నివ్వెరపోయేలా చేసింది. మూడు రైళ్ళు ఢీకొన్న ఈ భయానక ఘటనలో.. దాదాపు 300 మంది మృత్యువాత పడ్డారు. 1,175 మంది గాయపడ్డారు. అలాంటి ప్రమాదం జరిగిన చోట.. సాధారణ పరిస్థితులు ఏర్పడాలంటే అంత ఈజీ కాదు. కానీ, ఇండియన్‌ రైల్వే.. దాన్ని నిజం చేసి చూపించింది.

Odisha Train Accident: బాలాసోర్‌ ప్రమాద స్థలంలో ట్రాక్‌ పునరుద్ధరణ పూర్తి.. రైళ్లకు రూట్‌ క్లియర్‌.. నడిచిన గూడ్స్‌ రైలు
Resumes Trains
Follow us on

ఒడిశా రాష్ట్రంలో బాలాసోర్‌ దగ్గర జరిగిన రైలుప్రమాదం.. దేశాన్ని నివ్వెరపోయేలా చేసింది. మూడు రైళ్ళు ఢీకొన్న ఈ భయానక ఘటనలో.. దాదాపు 300 మంది మృత్యువాత పడ్డారు. 1,175 మంది గాయపడ్డారు. అలాంటి ప్రమాదం జరిగిన చోట.. సాధారణ పరిస్థితులు ఏర్పడాలంటే అంత ఈజీ కాదు. కానీ, ఇండియన్‌ రైల్వే.. దాన్ని నిజం చేసి చూపించింది. కేవలం 51 గంటల్లోనే.. ప్రమాదస్థలంలో ధ్వంసమైన ట్రాక్‌ పునరుద్ధరణ పనులు పూర్తిచేసింది. ఆ రూట్లో రైళ్ల రాకపోకలకు రూట్‌ క్లియర్‌ చేసింది. పునరుద్ధరణ పూర్తయిన ఫస్ట్‌ లైన్‌ మీద.. తొలుత గూడ్స్‌ రైలు నడిచింది. మరికొన్ని రైళ్ళు కూడా నడవనున్నాయి. రెండో లైన్‌కు కూడా ఫిట్‌నెస్‌ సర్టిఫికేట్‌ వచ్చేసింది.

ఆరోపణలకు వెరవని వైష్ణవ్‌..

ఇంతటి ఘోర ప్రమాదం తర్వాత.. కేవలం 51 గంటల్లో ట్రాక్‌ పునరుద్ధరణ జరిగిందంటే.. దానికి కారణం రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ చొరవేనని చెప్పాలి. అందరు నేతల మాదిరి కాకుండా.. ప్రమాదం జరిగినవెంటనే హుటాహుటిన అక్కడికి వెళ్లారు. ప్రమాద ప్రదేశాన్ని అణువణువునా పరిశీలించారు. ఈ రెండ్రోజులూ అక్కడే ఉండి సహాయచర్యల్ని అనుక్షణం దగ్గరుండీ పర్యవేక్షిస్తూ రైల్వే అధికారులకు, సిబ్బందికి అండగా నిలిచారు. ఓ వైపు ప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తూనే.. ఇంకో వైపు సహాయక చర్యలు ఊపందుకునేలా అధికారుల్ని పరిగెత్తించారు. ప్రమాదానికి గురైన ట్రాక్ మరమ్మత్తులు, ట్రాక్ పునరుద్ధరణ పనుల్లో వేగం పుంజుకునేలా చూశారు అశ్విని. గత రైల్వే మంత్రుల కంటే… అశ్వినీ వైష్ణవ్‌ ఈ విషయంలో చాలా భిన్నంగా కనిపించారని చెప్పొచ్చు. రాజీనామా చేయాలంటూ విపక్షాలు డిమాండ్‌ చేస్తున్నా.. వీసమెత్తయినా వెరవకుండా తనపని తాను చేసుకుపోయారు.

పునరుద్ధరణలో హీరో అశ్వినీ వైష్ణవ్‌..

ఒకరకంగా చెప్పాలంటే.. ఇంతటి ట్రాజెడీ తర్వాత రైల్వేను మళ్లీ ట్రాక్‌ ఎక్కించడం సాధారణ విషయం కాదు. కానీ, ఈ విషయంలో అశ్వినీ వైష్ణవ్‌ను హీరో అనాల్సిందే. గతంలో ప్రమాదాలు జరిగినప్పుడు రైల్వే మంత్రులుగా ఉన్నవారు స్టేట్‌మెంట్లకే పరిమిమయ్యేవారు. స్పాట్‌కి వెళ్లడం, ఫోటోలు దిగడం, సానుభూతి ప్రకటనలు చేసి చల్లగా జారుకోవడం.. ఇలాంటివే చూశాం. పునరుద్ధరణ పనులు దేవుడెరుగు.. నెలల తరబడి పనులు జరిగేవి. అన్నింటినీ అధికారులపై నెట్టేసి.. మంత్రులు చేతులెత్తేసేవారు. ఫలితంగా రోజుల తరబడి జనాలకు చుక్కలు కనిపించేవి. కానీ, ఇప్పుడా పరిస్థితి రానివ్వలేదు అశ్విని వైష్ణవ్‌. దానికి ప్రత్యక్ష ఉదాహరణే.. ప్రమాదం జరిగిన రెండ్రోజుల్లోనే బాలాసోర్‌లో కనిపిస్తున్న సాధారణ పరిస్థితి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..