AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Olive Ridley Turtle: లక్షలాదిగా వచ్చి.. కోట్లాదిగా వెళ్ళడానికి బరంపురానికి చేరుతున్న తాబేళ్లు… వీటి స్పెషాలిటీ ఏమిటంటే

Olive Ridley Turtle: ఉభయచర జీవుల్లో తాబేళ్లు (Turtle) ఒకటి.. వీటిల్లో అనేక రకాలు ఉన్నాయి. అయితే తాబేళ్లలో ఆలీవ్ రెడ్లీ తాబేళ్లు వెరీ వెరీ స్పెషల్. ఈ తాబేళ్లు ఎక్కువగా జపాన్, ఆ్రస్టేలియా, న్యూజిలాండ్‌ తదితర దేశాల్లో..

Olive Ridley Turtle: లక్షలాదిగా వచ్చి.. కోట్లాదిగా వెళ్ళడానికి బరంపురానికి చేరుతున్న తాబేళ్లు... వీటి స్పెషాలిటీ ఏమిటంటే
Olive Ridley Turtles In Beh
Surya Kala
|

Updated on: Apr 01, 2022 | 2:08 PM

Share

Olive Ridley Turtle: ఉభయచర జీవుల్లో తాబేళ్లు (Turtle) ఒకటి.. వీటిల్లో అనేక రకాలు ఉన్నాయి. అయితే తాబేళ్లలో ఆలీవ్ రెడ్లీ తాబేళ్లు వెరీ వెరీ స్పెషల్. ఈ తాబేళ్లు ఎక్కువగా జపాన్, ఆ్రస్టేలియా, న్యూజిలాండ్‌ తదితర దేశాల్లో కనిపిస్తాయి. నదులు సముద్రంలో కలిసే చోటు వీటి సంతానోత్పత్తికి అనువుగా ఉంటుంది. అందుకనే ఆయా దేశాల నుంచి సంతాన ఉత్పత్తి కోసం ఆలీవ్ రెడ్లీ తాబేళ్లు లక్షలాదిగా ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల తీరాలకు సముద్ర మార్గంలో వలస వస్తూంటాయి. ఈ నేపధ్యంలో ఆడ ఆలీవ్ రెడ్లీ తాబేళ్లు తాజాగా ఒడిశాలోని బరంపురం సముద్ర తీరంలో సందడి చేస్తున్నాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా దాదాపు 2లక్షల 42వేలు ఆలీవ్ రెడ్లీ ఆడ తాబేళ్లు గుడ్లు పెట్టడానికి సముద్ర తీరానికి చేరుకున్నాయి. ఈ నేపధ్యంలో ఒరిస్సా అటవి అధికారులు తాబేళ్లకు, అవి పెట్టే గుడ్లకు ఎటువంటి హాని కలుగకుండా చర్యలు చేపట్టారు. వాటిని సంరక్షించే పనిలో నిమగ్నమయ్యారు.

జీవితాంతం సముద్రంలో గడిపే ఈ జీవులు.. కేవలం గుడ్లు మాత్రమే పెట్టడానికి భూమి మీదకు వస్తాయి. వీటికి స్థిర నివాసం ఉండదు. రెండడుగుల పొడవు, సుమారు 500 కేజీల బరువు ఉంటాయి. ఆహారాన్వేషణ, గుడ్లు పెట్టడం, సంతానోత్పత్తి కోసం దాదాపు 20 వేల కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా కనిపించే అన్ని సముద్ర తాబేళ్లలో ఇవి రెండో అతి చిన్న ర‌కం తాబేళ్లు. తమకు జన్మనిచ్చిన చోటే.. మళ్ళీ అక్కడే గుడ్లు పెట్టే జీవి ఒక్క సముద్ర తాబేలు మాత్రమే. ఆలివ్ రిడ్లే తాబేళ్లు తాబేళ్లు మాంసాహారులు. జెల్లీ ఫిష్, సీ ఆర్చిన్స్, ట్యూనికేట్స్, నత్తలు, బ్రయోజోవాన్స్, బివాల్వ్స్, పీతలు, రొయ్యలు మొదలైన వాటిని తింటాయి. ప్రమాదం ఉన్న జీవుల జాబితాలో ఈ తాబేళ్లు కూడా ఉన్నాయి.

Also Read: Srirama Navami: కోరుకొండ నుంచి గోటి తలంబ్రాలు రెడీ.. రాములోరి కి రామచిలక సందేశం..

శతాధిక వృద్ధుడు స్వామి శివానంద ఫిట్‌‌నెస్ రహస్యం ఏమిటంటే