Watch Video: ఎమ్మెల్యేను పొట్టు పొట్టుగా కొట్టిన జనాలు.. సంచలనంగా మారిన వీడియో..

Odisha BJD MLA Prashant Jagdev: యూపీలోని లఖీంపూర్ ఖేరీ ఘటనను గుర్తుచేసేలా.. ఒడిశాలో మరో ఘటన చోటుచేసుకుంది. ఒడిశా రాష్ట్రంలోని ఖోర్ధా జిల్లా బాన్‌పూర్ బ్లాక్ సమీపంలో

Watch Video: ఎమ్మెల్యేను పొట్టు పొట్టుగా కొట్టిన జనాలు.. సంచలనంగా మారిన వీడియో..
Mla
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Mar 12, 2022 | 6:40 PM

Odisha BJD MLA Prashant Jagdev: యూపీలోని లఖీంపూర్ ఖేరీ ఘటనను గుర్తుచేసేలా.. ఒడిశాలో మరో ఘటన చోటుచేసుకుంది. ఒడిశా రాష్ట్రంలోని ఖోర్ధా జిల్లా బాన్‌పూర్ బ్లాక్ సమీపంలో చిలికా ఎమ్మెల్యే ప్రశాంత్ జగదేవ్ కారు జనంపై దూసుకెళ్లింది. దీంతో చాలామంది గాయపడ్డారు. దీంతో స్థానికులు ఆగ్రహంతో ఎమ్మెల్యేపై దాడి చేశారు. ఈ దాడిలో ఎమ్మెల్యే తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చిలికా ఎమ్మెల్యే ప్రశాంత్​ జగ్​దేవ్ కారు శనివారం జనాలపైకి దూసుకెళ్లింది. దీంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో మొత్తం 22 మంది గాయపడ్డారు. వీరిలో 15 మంది బీజేపీ కార్యకర్తలు, ఏడుగురు పోలీసు సిబ్బంది ఉన్నట్లు అదికారులు తెలిపారు. ఈ ఘటనలో బానాపుర్‌ ఇన్‌ఛార్జ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆర్‌ఆర్‌ సాహు సైతం తీవ్రంగా గాయపడ్డారని.. క్షతగాత్రులను భువనేశ్వర్​ ఎయిమ్స్​కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

కాగా.. ఖుర్దా జిల్లాలో పంచాయతీ సమితి చైర్‌పర్సన్ ఎన్నికలు జరుగుతుండటంతో బానాపుర్ బ్లాక్​ ఆఫీస్​ ఎదుట పార్టీ పార్టీ కార్యకర్తలు నిలబడి ఉన్నారు. ఈ సమయంలో బిజూ జనతా దళ్‌ (బీజేడీ) బహిష్కృత ఎమ్మెల్యే ప్రశాంత్‌ జగ్‌దేవ్‌ కారుతో వారిపైకి దూసుకెళ్లారు. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజలు ఆ ఎమ్మెల్యేపై దాడికి దిగారు. దీంతోపాటు ఆయన వాహనాన్ని కూడా ధ్వంసం చేశారు. ఘటనా సమయంలో ఎమ్మెల్యే మద్యం మత్తులో ఉన్నారంటూ స్థానికులు పేర్కొంటున్నారు.

అనంతరం జగ్​దేవ్​ను పోలీసులు.. భువనేశ్వర్‌లోని ఆసుపత్రికి తరలించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణతో గతేడాది సెప్టెంబరులో జగదేవ్‌ను బీజేడీ సస్పెండ్‌ చేసింది. ఈ ఘటనపై ఖోర్ధా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

Also Read:

Viral Video: స్టంట్ చేయబోయి బొక్కబోర్లా పడిన ముద్దుగుమ్మ.. నవ్వులు పూయిస్తున్న వీడియో..

Viral Video: ‘నాదీ నక్కిలీసు గొలుసు’ అంటూ దుమ్ము రేపిన ఎమ్మెల్యే.. డ్యాన్స్ చించేశారంతే..!