డేటింగ్ యాప్ పై నుస్రత్ జహాన్ ఫైర్, పోలీసులకు ఫిర్యాదు

తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, నటి నుస్రత్ జహాన్ కి పట్టరాని కోపమొచ్చింది. తన అనుమతి లేకుండా ఓ డేటింగ్ యాప్ ప్రమోషన్ కోసం తన ఫోటోను వాడుకోవడంపై ఆమె మండిపడింది.

  • Umakanth Rao
  • Publish Date - 7:55 pm, Mon, 21 September 20
డేటింగ్ యాప్ పై నుస్రత్ జహాన్ ఫైర్, పోలీసులకు ఫిర్యాదు

తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, నటి నుస్రత్ జహాన్ కి పట్టరాని కోపమొచ్చింది. తన అనుమతి లేకుండా ఓ డేటింగ్ యాప్ ప్రమోషన్ కోసం తన ఫోటోను వాడుకోవడంపై ఆమె మండిపడింది. ‘మేక్ న్యూ ఫ్రెండ్స్ సిట్టింగ్ ఎట్ హోమ్ డ్యూరింగ్ లాక్ డౌన్’ (లాక్ డౌన్ సమయంలో ఇంట్లో కూర్చుని కొత్త ఫ్రెండ్స్ ని చేర్చుకోండి) అనే క్యాప్షన్ తో ఆ యాప్ ఈమె ఫోటోను వినియోగించుకుంది. నుస్రత్ ఈ యాడ్ ని స్క్రీన్ షాట్ తీసి కోల్ కతా పోలీసు కమిషనర్ కు, సైబర్ సెల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది, ఈ యాప్ పై లీగల్ చర్య తీసుకుంటానని హెచ్చరించింది. ఈ యాప్ పై కఠిన చర్య తీసుకోవాలని  పోలీసులకు ఆమె విజ్ఞప్తి చేసింది. తాజాగా నుస్రత్ జహాన్,,’ఎస్ ఓ ఎస్ కోల్ కతా ‘అనే చిత్రంలో నటిస్తోంది.