నందాదేవి పర్వతంపై అసలేం జరిగింది? ఒక్కసారిగా మంచు చరియలు ఎందుకు విరిగిపడ్డాయి..? మంచుకొండల్లో దాగిన మర్మమేంటీ..?

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మంచు చరియలు విరిగిపడి చమోలీ జిల్లాలోని గ్రామాలు నీట మునిగాయి. ఈ అనూహ్యమైన ఈ పరిణామం వెనుక ఊహించని కారణం ఎమైనా ఉందా?

నందాదేవి పర్వతంపై అసలేం జరిగింది? ఒక్కసారిగా మంచు చరియలు ఎందుకు విరిగిపడ్డాయి..? మంచుకొండల్లో దాగిన మర్మమేంటీ..?
Balaraju Goud

| Edited By: Sanjay Kasula

Feb 08, 2021 | 6:29 PM

Nuclear threat posed Himalayas : నందాదేవి పర్వతంపై నుంచి ఒక్కసారిగా మంచు చరియలు విరిగిపడ్డాయి. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చమోలీ జిల్లాలోని గ్రామాలు నీట మునిగాయి. ఈ అనూహ్యమైన ఈ పరిణామం వెనుక ఊహించని కారణం ఎమైనా ఉందా? ఉందీ అని కచ్చితంగా చెప్పలేంగానీ.. చెప్పుకోడానికి ఈ మిస్టరీ రీజన్‌గా కనిపిస్తోంది. అదే ఆపరేష్‌ హ్యాట్.

ఇది ఇప్పటి కథ కాదు. ఐదు దశాబ్దాల నుంచి మిస్టరీగా మిగిలిపోయిన భయం. దానిపేరే ఆపరేషన్ హ్యాట్. 1964లో చైనా తొలిసారి అణుపరీక్షలు జరిపింది. ఆ పరీక్ష అమెరికాలో అనుమానాన్ని, అసహనాన్ని పెంచింది. దడ పెంచుకున్న అమెరికా చైనా అణుపాటవం మీద ఫోకస్ పెట్టాలనుకుంది. కానీ ఖండాతరాల అవతల ఉన్న అమెరికాకు ఆ ఛాన్స్ దొరకలేదు. అందుకే భారత్‌ సాయం కోరింది. అందులో భాగంగానే 1965లో అమెరికా సీఐఏ, భారత్ ఐబీని అర్థించింది. అప్పట్లో అనాలోచితంగా భారత్ కూడా ఓకే చెప్పింది.

ఇక, మిగిలింది చైనామీద కన్నేయడమే. అది జరగాలంటే చైనాకు సమీపంలో ఉన్న, ఉన్నచోట నుంచి చైనా పరిసరాలను గమనించగల స్థావరం కోసం వెతకడం. అప్పుడు వాళ్లు ఎంచుకున్న స్థలం నందాదేవి పర్వతం. అక్కడి నుంచి చైనా మీద ఫోకస్‌ చాలా సులువు. అక్కడ సెన్సార్స్‌ ఏర్పాటు చేస్తే.. చైనా గుట్టు కాస్తయినా తెలుస్తుందని సీఐఏ, ఐబీ అనుకున్నాయి. ఇందుకోసం 1965 జూన్ 23న అలస్కాలో ట్రయల్ రన్ కూడా నిర్వహించాయి. అది సక్సెస్ అయ్యింది.

ఆ తర్వాత సీఐఏ, ఐబీ ఒక బృందంగా ఏర్పడి నందాదేవి పర్వతంపైకి వెళ్లాయి. ప్రక్రియకు అవసరమైన ఎక్విప్‌మెంట్ తీసుకెళ్లాయి. అందులో అణు ఇంధనంతో నడిచే జనరేటర్‌, ఫ్లూటోనియం క్యాప్సూల్, ఏంటెనాలు ఉన్నాయి. వాళ్లు వెళ్లి ఎక్విప్‌మెంట్ ఇన్‌స్టాల్ చేసే టైమ్‌కి అక్కడి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఇంకాసేపు ఉంటే ప్రాణాలు పోతాయన్న భయంతో.. వెంటనే అందరూ అక్కడి నుంచి వచ్చేశారు. వాతావరణం అనుకూలించిన తర్వాత మళ్లీ పని మొదలుపెట్టాలనుకున్నారు. కానీ మళ్లీ వెళ్లి చూస్తే.. అక్కడ అణుధార్మిక పదార్థమైన ఫ్లూటోనియం క్యాప్సూల్‌ లేదు. జనరేటర్ కూడా మిస్సయ్యింది. యాంటీనాలూ చూద్దామన్నా కనిపించలేదు. అదృశ్యమైన అణు పదార్థం కోసం 1966 – 67మధ్య కాలంలో కూడా నందాదేవి పర్వతంపై గాలించారు. అయినా, నో యూజ్. అప్పడు మొదలైనంది అసలు భయం..!

ఇదంతా ఎవరో సృష్టించిన కల్పితం కాదు. స్వయంగా కెప్టెన్‌ మన్మోహన్ కోహ్లీ చెప్పిన పరమరహస్యం. ఆయనే అప్పట్లో మన ఐబీ టీమ్‌కి నేతృత్వం వహించిన వ్యక్తి. ఆయన చెప్పిన వివరాల ప్రకారం.. నందాదేవిలో అదృశ్యమైన ఫ్లూటోనియం క్యాప్సిల్ లైఫ్ టైమ్ వందేళ్లు. ప్రస్తుతం 55ఏళ్లు పూర్తయ్యింది. అంటే ఇంకా 45 ఏళ్లు మిగిలి ఉంది. టెక్నాలజీ పెరిగింది. ఖనిజం ఎంత లోతులో ఉందో తెలుసుకునే సత్తా ఉంది కాబట్టి, నందాదేవిపై ఇప్పటికైనా పరిశోధనలు చెయ్యాలని రెండేళ్ల క్రితం ఆయన కేంద్రాన్ని కోరారు. ఆయన మాటలను బేస్ చేసుకుని.. 2018లో ఉత్తరాఖండ్‌కు చెందిన మంత్రి సత్పల్ మహారాజ్‌ ప్రధాని మోదీని కలిశారు. అణుముప్పు గురించి వివరించారు. వెలికి తీయకపోతే ఎప్పటికైనా ప్రమాదం తప్పదని హెచ్చరించారు. పరికరాల జాడ కోసం ప్రయత్నిస్తామని అప్పట్లో మోదీ కూడా చెప్పారు.

మన్మోహన్‌ కోహ్లీ చెప్పిన మాటల ప్రకారం.. నందాదేవిలో ఉన్న ఫ్లూటోనియం కరగడం ప్రారంభిస్తే.. అది గంగానది నీటిలో కలుస్తుంది. దీంతో అక్కడి నుంచి పశ్చిమబెంగాల్ వరకూ రేడియేషన్ ప్రభావం ఉంటుంది. ఇప్పుడు నందాదేవి పర్వతనం నుంచి అతి భారీ మంచు చరియలు విరిగిపడ్డానికి కారణం.. అప్పటి ఆపరేషన్ హ్యాట్‌ కావచ్చా అన్నది కూడా ఓ అనుమానం. ఇదే జరిగి ఉంటుందని కచ్చితంగా చెప్పలేం గానీ.. అప్పటి ఆ మిస్టరీ మాత్రం నందాదేవి పేరు చెబితే చాలు ఇప్పటికీ వెంటాడుతుంది.

Read Also…  Uttarakhand Glacier Outburst: చమోలీ డిజాస్టర్ కి కారణాలు ఎన్నో ! మన ‘స్వయం కృతాపరాధం’ ! మానవ తప్పిదం కూడా !

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu