ఇక్కడేం ధర్మసత్రాలు నడపడం లేదు.. ఎన్నార్సీపై హుస్సేన్

దేశ వ్యాప్తంగా జాతీయ పౌర జాబితా అమలు చేయాలన్న మోదీ సర్కార్ నిర్ణయానికి ఆ పార్టీ వర్గాల నుంచి మద్దతు పెరుగుతోంది. దేశం నుంచి అక్రమ వలసదారులను వెళ్లగొట్టాలన్న డిమాండ్ ఊపందుకుంటుంది. దేశంలో ఎక్కడా వలసదారులు దేశ వ్యాప్తంగా ఎన్నార్సీని అమలు చేయబోతున్నట్లు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే అసోంలో చేపట్టిన తరహాలోనే దేశ వ్యాప్తంగా జాతీయ పౌర జాబితాను తయారు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల […]

ఇక్కడేం ధర్మసత్రాలు నడపడం లేదు.. ఎన్నార్సీపై హుస్సేన్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Sep 21, 2019 | 5:46 AM

దేశ వ్యాప్తంగా జాతీయ పౌర జాబితా అమలు చేయాలన్న మోదీ సర్కార్ నిర్ణయానికి ఆ పార్టీ వర్గాల నుంచి మద్దతు పెరుగుతోంది. దేశం నుంచి అక్రమ వలసదారులను వెళ్లగొట్టాలన్న డిమాండ్ ఊపందుకుంటుంది. దేశంలో ఎక్కడా వలసదారులు దేశ వ్యాప్తంగా ఎన్నార్సీని అమలు చేయబోతున్నట్లు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే అసోంలో చేపట్టిన తరహాలోనే దేశ వ్యాప్తంగా జాతీయ పౌర జాబితాను తయారు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల నుంచి బీజేపీ నేతలు తమ రాష్ట్రంలో ఎన్నార్సీ అమలు చేయాలంటూ యూపీ సీఎం యోగీ, తెలంగాణ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ అధికార ప్రతినిధి షానవాజ్ హుస్సేన్ స్పందించారు. బీహార్‌లోని మాధేపుర జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో అక్రమ వలసదారులనుద్దేశించి మాట్లాడారు.

భారత దేశంలోకి వచ్చి ఇక్కడే ఉండిపోడానికి ఇక్కడేం ధర్మ సత్రాలు నడపడం లేదన్నారు. ప్రస్తుతం పలు దేశాలకు సంబంధించిన ప్రజలు ఇక్కడకు వచ్చి.. ఏళ్లతరబడి ఉంటున్నారని.. వారిని ఎవరూ అడ్డుకోవడం లేదన్నారు. ఇక అక్రమంగా దేశంలో ఉండేవారిని పంపిచే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని అన్నారు. ఇక ఇతర దేశాల నుంచి వచ్చిన వారికి పాస్‌పోర్ట్ ఉండాలని.. దాని గడువు ముగిస్తే వెళ్లిపోవాల్సిందేనని అన్నారు. ప్రతి అక్రమ వలసదారుడిని పరిశీలించి పంపిచాల్సిందేనన్నారు. అక్రమ వలసదారులను దేశం నుంచి పంపించేందుకు ఇటీవల అసోంలో ఎన్నార్సీ తుది జాబితాను ప్రకటించిన విషయం తెలిసిందే.