బీజేపీ గెలవాలంటే మరో పుల్వామా జరగాలి: పవార్ వివాదాస్పద వ్యాఖ్యలు
మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎస్పీపీ అధినేత, సీనియర్ నాయకుడు శరద్ పవార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధికారంలోకి రావాలంటే పుల్వాంటి లాంటి ఘటనలు జరగాలని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ప్రభుత్వంపై మహారాష్ట్ర ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని.. ఈ అభిప్రాయాన్ని మార్చాలంటే పుల్వామా లాంటి ఘటనలు జరగాలని ఆయన కామెంట్లు చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు దేశవ్యాప్తంగా మోదీ సర్కారుపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉండేవారని.. కానీ పుల్వామా […]
మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎస్పీపీ అధినేత, సీనియర్ నాయకుడు శరద్ పవార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధికారంలోకి రావాలంటే పుల్వాంటి లాంటి ఘటనలు జరగాలని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ప్రభుత్వంపై మహారాష్ట్ర ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని.. ఈ అభిప్రాయాన్ని మార్చాలంటే పుల్వామా లాంటి ఘటనలు జరగాలని ఆయన కామెంట్లు చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు దేశవ్యాప్తంగా మోదీ సర్కారుపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉండేవారని.. కానీ పుల్వామా ఘటన తరువాత పరిణామాలు రాజకీయ వాతావరణాన్ని సమూలంగా మార్చివేశాయని తెలిపారు. ఫడ్నవీస్ సర్కారు గత ఐదేళ్లలో ప్రజలకు చేసిందేమీ లేదని ఆయన విమర్శించారు. ఎన్సీపీపై ప్రజల్లో భారీ అంచనాలు ఉన్నాయని పవార్ పేర్కొన్నారు.
ఇక ఇప్పటికే మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీ మధ్య పొత్తు కుదిరిందని.. బహుజన్ వికాస్ అఘాదీ, సమాజ్‌వాదీ పార్టీ లాంటి చిన్న పార్టీలను కలుపుకునేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన చెప్పుకొచ్చారు. పొత్తుల్లో భాగంగా రాజ్ ఠాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేనతో కలవడానికి ఎన్సీపీ సిద్ధంగా ఉందని.. కానీ కాంగ్రెస్ అందుకు ఒప్పుకోవడం లేదని శరద్ పవార్ తెలిపారు. ఇక తమ పార్టీ నుంచి బీజేపీ, శివసేనలోకి వెళుతున్నవారందరూ అవకాశవాదులని ఆయన విమర్శించారు. మోదీ ప్రభుత్వం సీబీఐ, ఈడీ లాంటి చట్టబద్ధ సంస్థల్ని దుర్వినియోగం చేసిందని పవార్ ఆరోపించారు.