ఇక బీజేపీయేతర ప్రభుత్వాలకు చెల్లు… శివసేన
దేశంలో బీజేపీ యేతర పార్టీలు నిలవలేవని శివసేన పార్టీ వెల్లడించింది. కర్ణాటక తాజా రాజకీయ సంక్షోభం నేపథ్యంలో శివసేన ఈ వ్యాఖ్యలు చేసింది. కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన రోజే అది కూలిపోతుందని ఊహించామని ఈ పార్టీ అధికార పత్రిక సామ్నాలో పేర్కొంది. కర్ణాటక సంకీర్ణ ప్రభుత్వం కూలిపోతుందన్నది సుస్పష్టమని.. కుమారస్వామి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడడమనేది అసాధారణ పద్ధతిలో జరిగిందని తెలిపింది. కుమారస్వామి మద్దతుతో సిద్దరామయ్య ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని ఆశిస్తున్నారని వెల్లడించింది. రాబోయే రోజుల్లో దేశంలో […]
దేశంలో బీజేపీ యేతర పార్టీలు నిలవలేవని శివసేన పార్టీ వెల్లడించింది. కర్ణాటక తాజా రాజకీయ సంక్షోభం నేపథ్యంలో శివసేన ఈ వ్యాఖ్యలు చేసింది. కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన రోజే అది కూలిపోతుందని ఊహించామని ఈ పార్టీ అధికార పత్రిక సామ్నాలో పేర్కొంది. కర్ణాటక సంకీర్ణ ప్రభుత్వం కూలిపోతుందన్నది సుస్పష్టమని.. కుమారస్వామి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడడమనేది అసాధారణ పద్ధతిలో జరిగిందని తెలిపింది. కుమారస్వామి మద్దతుతో సిద్దరామయ్య ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని ఆశిస్తున్నారని వెల్లడించింది. రాబోయే రోజుల్లో దేశంలో బీజేపీయేర ప్రభుత్వాలు ఎక్కువ కాలం నిలవవని పేర్కొంది.