NOMINATIONS: ముగిసిన నామినేషన్ల పర్వం.. ఏపీ, తెలంగాణలో ఎంతమంది పోటీలో ఉన్నారంటే..?

|

Apr 30, 2024 | 7:43 AM

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు సంబంధించి కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్ల పర్వంలో భాగంగా ఏప్రిల్ 29తో నామినేషన్ల ఉపసంహరణ గడువు పూర్తి అయ్యింది. ఇక మిగిలిన అభ్యర్థులంతా ఎన్నికల బరిలో ఉంటారు. రాష్ట్రాల్లో నామినేషన్ల ఉపసంహరణతో కొంత మంది, మరికొందరి నామినేషన్లను ఈసీ తిరస్కరించారు. దీంతో పోటీలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితాను ఎన్నికల సంఘం అధికారులు ప్రకటించారు.

NOMINATIONS: ముగిసిన నామినేషన్ల పర్వం.. ఏపీ, తెలంగాణలో ఎంతమంది పోటీలో ఉన్నారంటే..?
Elections
Follow us on

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు సంబంధించి కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్ల పర్వంలో భాగంగా ఏప్రిల్ 29తో నామినేషన్ల ఉపసంహరణ గడువు పూర్తి అయ్యింది. ఇక మిగిలిన అభ్యర్థులంతా ఎన్నికల బరిలో ఉంటారు. రాష్ట్రాల్లో నామినేషన్ల ఉపసంహరణతో కొంత మంది, మరికొందరి నామినేషన్లను ఈసీ తిరస్కరించారు. దీంతో పోటీలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితాను ఎన్నికల సంఘం అధికారులు ప్రకటించారు.

దేశవ్యాప్తంగా 7 విడతల్లో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 4వ దశలో తెలంగాణ, ఏపీ లోక్‌సభ ఎన్నికలతోపాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ క్రమంలోనే ఏప్రిల్ 18 నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలైంది. ఏప్రిల్ 25 వరకూ నామినేషన్లు స్వీకరించారు. నామినేషన్ల పరిశీలన ప్రక్రియ అనంతరం నామినేషన్ల విత్ డ్రా గడువు ఏఫ్రిల్ 29తో ముగిసింది. దీంతో బరిలో ఉన్న అభ్యర్థులపై ఓ స్పష్టత వచ్చింది. ఇందులో పార్టీలు బీఫామ్‌లు దక్కించుకున్న నేతలతో పాటు.. రెబల్స్, స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు.

ఏపీలోని 25 లోక్‌సభ నియోజకవర్గాలకు 731 నామినేషన్లు దాఖలుకాగా.. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత అత్యధికంగా నంద్యాల పార్లమెంటుకు 36 నామినేషన్లు రాగా, అత్యల్పంగా రాజమండ్రి పార్లమెంట్ స్థానానికి 12 నామినేషన్లు వచ్చినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇక.. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా 175 అసెంబ్లీ స్థానాలకు 4,210 నామినేషన్లు దాఖలు కాగా, చివరికి 2705 మంది బరిలో నిలిచారు. తిరుపతి నుంచి అత్యధికంగా 48 నామినేషన్లు దాఖలు కాగా.. అత్యల్పంగా చోడవరం స్థానానికి 6 నామినేషన్లు దాఖలైనట్లు ఈసీ తెలిపింది. ఇక మే- 13న ఒకే విడతలో ఆంధప్రదేశ్ లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలతోపాటు తెలంగాణ లోక్‌సభ పోలింగ్.. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి.

తెలంగాణలో ఉపసంహరణ గడువు ముగిసేసరికి రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల బరిలో 525 మంది అభ్యర్థులు ఉన్నట్లు తుది ప్రకటన చేసింది ఎలక్షన్ కమిషన్. నామినేషన్ పరిశీలన తేదీ వరకు ఎన్నికల బరిలో 625 మంది ఉండగా… ఉపసంహరణ చివరి తేదీ ముగిసేసరికి రాష్ట్రవ్యాప్తంగా వందమంది అభ్యర్థులు ఉపసంహరించుకున్నట్లు ప్రకటించింది ఈసీ.

తెలంగాణలో గతం కంటే ఎక్కువ సంఖ్యలో నామినేషన్లు దాఖలు అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా నామినేషన్ల తేదీ ముగిసే నాటికి 893 మంది అభ్యర్థులు 1,488 సెట్ల నామినేషన్లు దాఖలు అయ్యాయి. నామినేషన్ల పరిశీలన తరువాత 17 పార్లమెంటు స్థానాలకు గాను 625 మంది నామినేషన్లను ఎన్నికల కమిషన్ ఆమోదించింది. 268 మంది నామినేషన్లను తిరస్కరించింది ఈసీ. అత్యధికంగా మల్కాజిగిరి పార్లమెంటు సెగ్మెంట్లో 77 మంది స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించి రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు తావిచ్చింది ఎన్నికల సంఘం.

ఇక నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో అసలైన అభ్యర్థుల లెక్కలను ప్రకటించింది ఈసీ. రాష్ట్ర వ్యాప్తంగా 525 బరిలో ఉన్నట్లు తుది ప్రకటన చేసింది ఎలక్షన్ కమిషన్. పరిశీలన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా 625 మంది అభ్యర్థులు 17 పార్లమెంటు సెగ్మెంట్లలో ఉండగా, వందమంది అభ్యర్థులు ఉపసంహరణ చేసుకాగా ఫైనల్ గా 525 బరిలో ఉన్నట్లు ప్రకటించింది ఎలక్షన్ కమిషన్. ఇక ఆదిలాబాద్ పార్లమెంట్ బరిలో 12 మంది, పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్లో 42 మంది, కరీంనగర్ ఎంపీ బరిలో 28 మంది, నిజామాబాద్ ఎంపీ బరిలో 29 మంది, జహీరాబాద్ పార్లమెంటు బరిలో 19 మంది,
మెదక్ పార్లమెంట్ పరిధిలో 44 మంది, మల్కాజిగిరి పార్లమెంట్ బరిలో 22 మంది, సికింద్రాబాద్ బరిలో 45 మంది, హైదరాబాద్ పార్లమెంట్ బరిలో 30 మంది, చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల బరిలో 43 మంది, మహబూబ్‌నగర్ ఎంపీ బరిలో 31 మంది, నాగర్ కర్నూల్ ఎంపీ బరిలో 19 మంది, నల్గొండ ఎంపీ బరిలో 22 మంది, భువనగిరి ఎంపీ బరిలో 39 మంది, వరంగల్ ఎంపీ బరిలో 42 మంది, మహబూబాబాద్ బరిలో 23 మంది, ఖమ్మం బరిలో 35 మంది అభ్యర్థులు ఉన్నట్లు ప్రకటించింది ఎలక్షన్ కమిషన్.

రాష్ట్రవ్యాప్తంగా 17 పార్లమెంటు సెగ్మెంట్లలో కలిపి వంద మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నట్లు తెలిపింది ఎలక్షన్ కమిషన్. అత్యధికంగా మల్కాజిగిరి పార్లమెంటు పరిధిలో 15 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరణ చేసుకోగా, అత్యల్పంగా సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో ఒక్కరు ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారు ఎన్నికల అధికారులు. భువనగిరి పార్లమెంటు పరిధిలో 12 మంది, నల్గొండ మెదక్ లలో 9 మంది, పెద్దపల్లి, జహీరాబాద్ ఏడుగురు, ఖమ్మం వరంగల్ ఆరుగురు, కరీంనగర్ ఐదుగురు, మహబూబ్‌నగర్‌లో నలుగురు, నిజామాబాద్ చేవెళ్లాలో ముగ్గురు. నాగర్ కర్నూల్ మహబూబాబాద్ లలో ఇద్దరు, సికింద్రాబాద్ ఆదిలాబాద్ లో ఒక్కరి చొప్పున తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నట్లు పేర్కొన్నారు రిటర్నింగ్ అధికారులు.

అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నామినేషన్ ప్రక్రియ పూర్తి అయిపోయింది… అభ్యర్థుల లెక్కలు ప్రకటన చేసిన నేపథ్యంలో బరిలో నిలిచే స్వతంత్ర అభ్యర్థులకు గుర్తులను సైతం కేటాయించింది ఎలక్షన్ కమిషన్. ఇక మే 13వ తేదీన పోలింగ్, జూన్ 4వ తేదీన ఎన్నికల కౌంటింగ్ లో నిర్వహించనుంది ఎన్నికల సంఘం. ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు గాను మొత్తం 4210 నామినేషన్ల దాఖలు కాగా, ఇప్పుడు 2705 మంది బరిలో నిలిచారు. తిరుపతి అసెంబ్లీ స్థానానికి అత్యధికంగా 48 మంది పోటీ పడుతున్నారు. చోడవరంలో అత్యల్పంగా ఆరుగురు బరిలో నిలిచారు. ఏపీలో 25 పార్లమెంట్‌ స్థానాలకు 731 మంది మొదట నామినేషన్‌ వేయగా, ఇప్పుడు 503 మంది పోటీలో నిలిచారు. ఎంపీ స్థానాల్లో నంద్యాల నుంచి 36 మంది పోటీ చేస్తున్నారు. రాజమండ్రి నుంచి 12 మంది నామినేషన్లకు ఆమోదం లభించింది. ఆరు స్థానాల్లో రెబల్‌ అభ్యర్థులు బరిలో ఉన్నారు.

నామినేషన్ల ఉపసంహరణ పూర్తి కావడంతో ఇక పూర్తి స్థాయిలో ప్రచారంపైనే ఫోకస్‌ పెట్టనున్నారు అభ్యర్థులు. ఇప్పటికే తమ తమ నియోజకవర్గాల్లో సుడిగాలి ప్రచారం చేస్తున్నారు. ఏపీలో అధికార వైసీపీతో పాటు కూటమి అభ్యర్థులు, కాంగ్రెస్‌ అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ప్రత్యర్థుల తీరును ఎండగడుతూ ప్రచారంలో హీట్‌ పెంచారు.

ఇటు తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీతో పాటు బీజేపీ, బీఆర్‌ఎస్‌ నేతలు క్యాంపెయిన్‌ కొనసాగిస్తున్నారు. మండే ఎండలను సైతం లెక్క చేయకుండా ప్రచారంలో దూసుకెళుతున్నారు. గెలుపు కోసం తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అభ్యర్థులు.

మరోవైపు ఎన్నికల నిర్వహణ కోసం అధికార యంత్రాంగం కూడా సమాయత్తమవుతోంది. పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు పోలింగ్‌ సిబ్బందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చారు ఎన్నికల అధికారులు. మరోవైపు అటు పోలీసులు కూడా సమస్యాత్మక ప్రాంతాలపై దృష్టి పెట్టారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…