మహిళలు నైటీలు, పురుషులు లుంగీలు వేసుకోవడం సర్వసాధారణమైన విషయం. కంఫర్ట్‌గా ఉండే ఉద్దేశంతో వీటిని ధరిస్తుంటారు. అయితే ఇంటికే పరిమితమయ్యే వీటిని బయట కూడా వేసుకుంటే ఎలా ఉంటుంది.? చూడ్డానికి బాగుండదు కదూ. అయితే ఇటీవలి కాలంలో నైట్ డ్రస్‌లపై కూడా బయట తిరుగుతోన్న వారి సంఖ్య పెరిగింది. ఇలా నైటీల్లో, లుంగీల్లో చూడలేకపోతున్నామంటూ.. వెళ్లి సొసైటీ పెద్దలకు ఫిర్యాదు చేశారు. దీంతో సొసైటీ పెద్దలు ఏకంగా లుంగీలు, నైటీలను నిషేధిస్తూ నోటీసులు జారీ చేశారు. ఇంతకీ ఏంటీ నైటీల గొడవ.? ఎక్కడ జరిగింది.? లాంటి వివరాలు తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..
నోయిడాలోని హిమసాగర్ అపార్ట్ మెంట్స్‌లో సుమారు 200 కుటుంబాలు నివసిస్తున్నాయి. వేసవి కారణంతో చాలా మంది సాయంత్రం పూట అలా బయటకు రావడం మొదలు పెట్టారు. అయితే వీరిలో మహిళలు నైటీల్లో, పురుషులు లుంగీల్లో దర్శనమివ్వడం కనిపించింది. దీంతో ఇది కొందరికి అసౌకర్యంగా అనిపించింది. వెంటనే సొసైటీ పెద్దలకు ఫిర్యాదు చేశారు. అప్పటికప్పుడు సమావేశమైన పెద్దలు అపార్ట్‌మెంట్‌లో ధరించాల్సి వస్త్రాలపై చర్చించారు.
అపార్ట్‌మెంట్ వాసులకు డ్రెస్ కోడ్ విధిస్తూ నోటీసులు జారీ చేశారు. జూన్ 10వ తేదీన అందరికీ నోటీసులు సైతం పంపించారు. ఇంతకీ ఆ నోటీసుల్లో ఏముందంటే.. ‘కాలనీలోని పార్కుల్లో తిరిగే సమయంలో మీ వస్త్రధారణ ఇతరులకు అభ్యంతరకరంగానూ అసౌకర్యంగా ఉండకుండా చూసుకోవాలి. ఇకపై కాలనీలో ఎవరూ నైటీలు, లుంగీలు వేసుకొని తిరగవద్దు’ అని నోటీసులో పేర్కొన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..