Meri Maati – Mera Desh: అప్పుడే భారత్ అభివృద్ధి చెందుతుంది.. పంచ ప్రాణ ప్రతిజ్ఞ కార్యక్రమంలో కేంద్రమంత్రులు..

|

Aug 17, 2023 | 2:11 PM

Meri Mati Mera Desh Campaign: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా 77వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీరులను గౌరవించుకోవడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. మేరీ మాటి.. మేరా దేశ్ (నా మట్టి.. నా దేశం) ప్రత్యేక ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం ఆగస్టు 9 నుంచి 30 వరకు కొనసాగనుంది.

Meri Maati - Mera Desh: అప్పుడే భారత్ అభివృద్ధి చెందుతుంది.. పంచ ప్రాణ ప్రతిజ్ఞ కార్యక్రమంలో కేంద్రమంత్రులు..
Meri Mati Mera Desh Campaign
Follow us on

Meri Mati Mera Desh Campaign: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా 77వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీరులను గౌరవించుకోవడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. మేరీ మాటి.. మేరా దేశ్ (నా మట్టి.. నా దేశం) ప్రత్యేక ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం ఆగస్టు 9 నుంచి 30 వరకు కొనసాగనుంది. మేరీ మాటీ మేరా దేశ్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మొక్కలు నాటి ‘పంచ్ ప్రాణ్ ప్రతిజ్ఞ’ చేశారు. గురువారం ఒడిశాలోని పూరీలో పర్యటించిన కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, ధర్మేంద్ర ప్రధాన్, బీజేపీ నేత సంబిత్ పాత్ర మేరీ మాటీ మేరా దేశ్ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటి ‘పంచ్ ప్రాణ్ ప్రతిజ్ఞ’ చేశారు. అంతకుముందు ఆర్థిక మంత్రి, విద్యాశాఖ మంత్రి పూరి జగన్నాథ ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. జగన్నాథుడి దర్శనానంతరం ప్రముఖ ఇసుక కళాకారుడు సుదర్శన్ పట్నాయక్ రూపొందించిన సైకత శిల్పాన్ని నిర్మలా సీతారామన్, ధర్మేంద్ర ప్రధాన్ సందర్వించారు. సుదర్శన్ మేరీ మాటీ మేరా దేశ్ అంశంపై ఒక కళాఖండాన్ని సిద్ధం చేశారు. ‘మేరి మాటి, మేరా దేశ్‌’ కార్యక్రమం కింద ‘పంచప్రాన్‌ ప్రతిజ్ఞ’ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మాట్లాడుతూ.. విదేశీయుల బానిసత్వంలో మనలో నాటుకున్న మనస్తత్వాన్ని తొలగించడం చాలా అవసరమన్నారు. అప్పుడే 2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని.. ప్రపంచం గర్వపడే రూపొందుతుందని తెలిపారు.

మేరి మాటి, మేరా దేశ్‌ కార్యక్రమంలో కేంద్రమంత్రులు..

ఈ ప్రచారం కింద దేశ వ్యాప్తంగా వీర జవాన్ల జ్ఞాపకార్థంగా పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇది ఆగస్టు 16 నుంచి ప్రారంభమై.. ముగింపు వేడుక 30 ఆగస్టున న్యూఢిల్లీలోని కద్వాతి పాత్‌లో ప్రముఖుల సమక్షంలో జరగనుంది. ఈ కార్యక్రమంలో దేశపౌరులందరినీ భాగస్వామ్యం చేసేలా కేంద్రం https://merimaatimeradesh.gov.in/ వెబ్‌సైట్ ను కూడా ప్రారంభించింది. దీనిలో చేసిన కార్యక్రమాల సెల్ఫీలను అప్‌లోడ్ చేయవచ్చు.

సుదర్శన్ సైకత శిల్పం..

దేశభక్తిని చాటుకున్న విద్యార్థులు..

Meri Maati – Mera Desh

కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, ధర్మేంద్ర ప్రధాన్ పూరీలోని సెంట్రల్ సంస్కృత విశ్వవిద్యాలయంలో జరిగిన ‘మేరీ మాటి, మేరా దేశ్’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల, కళాశాల విద్యార్థులు కలిసి త్రివర్ణాలతో భారతదేశ మ్యాప్‌ను రూపొందించారు. కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగుల్లో ధరించిన దుస్తులతో అంతా కలిసి.. దేశ పటం ఆకారంలో నిల్చొని దేశభక్తిని చాటుకున్నారు.

Meri Maati – Mera Desh

జులై 30వ తేదీన జరిగిన మన్ కీ బాత్ కార్యక్రమంలో.. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా 77వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీర స్వాతంత్ర్య సమరయోధులు, వీర జవాన్లను గౌరవించుకోవడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. మేరీ మాటీ మేరా దేశ్ (నా మట్టి.. నా దేశం) ప్రత్యేక ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అమరవీరుల జ్ఞాపకార్థం దేశవ్యాప్తంగా ప్రతి గ్రామ పంచాయతీలో స్మారకాలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని మోడీ వెల్లడించారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా అమృత్ కలశ్ యాత్ర చేపట్టనున్నామని.. దేశమంతటా వివిధ ప్రాంతాల నుంచి 7,500 కలశాల్లో పవిత్ర మట్టిని, దాంతో పాటు మొక్కలను సేకరించి.. వాటిని దేశ రాజధాని ఢిల్లీకి తీసుకురానున్నారు.

ఆ పవిత్రమైన మట్టితో ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం సమీపంలో అమృత్ వాటికను నిర్మించి.. దానిలో మొక్కలు నాటనున్నారు. ఈ అమృత వాటిక ఉద్యానవనం.. ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ కు చిహ్నంలా నిలుస్తుందని సాంస్కృతిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం..