బ్రేకింగ్: నిర్భయ కేసులో మరో ట్విస్ట్..!

తమకు విధించిన ఉరి శిక్షను తప్పించుకునేందుకు సకల ప్రయత్నాలు చేస్తోన్న నిర్భయ దోషులు తాజాగా మరో ట్విస్టు ఇచ్చారు. దోషుల్లో ఒకరైన పవన్ కుమార్ గుప్తా తాజాగా సుప్రీంలో ఓ పిటిషన్ దాఖలు చేశాడు.

  • Tv9 Telugu
  • Publish Date - 3:54 pm, Fri, 28 February 20
బ్రేకింగ్: నిర్భయ కేసులో మరో ట్విస్ట్..!

తమకు విధించిన ఉరి శిక్షను తప్పించుకునేందుకు సకల ప్రయత్నాలు చేస్తోన్న నిర్భయ దోషులు తాజాగా మరో ట్విస్టు ఇచ్చారు. దోషుల్లో ఒకరైన పవన్ కుమార్ గుప్తా తాజాగా సుప్రీంలో ఓ పిటిషన్ దాఖలు చేశాడు. తనకు విధించిన మరణశిక్షను జీవితఖైదుగా మార్చాలని కోరుతూ అతడు ఆ పిటిషన్‌లో పేర్కొన్నాడు. ఈ విషయాన్ని అతడి తరపు న్యాయవాది ఏపీ సింగ్ వెల్లడించారు.అలాగే , దిగువ కోర్టు జారీ చేసిన డెత్ వారెంట్‌పై కూడా స్టే ఇవ్వాలని అతడు డిమాండ్ చేశాడు. నేరం జరిగినప్పుడు తాను మైనర్ అని కూడా పేర్కొన్నాడు. కాగా ఇప్పటికే నిర్భయ దోషులకు ఉరిశిక్ష రెండు సార్లు వాయిదా పడింది. ఇక మార్చి 3న వీరికి ఉరిశిక్ష అమలు చేయనున్న క్రమంలో.. పవన్ కుమార్ క్యూరేటివ్ పిటిషన్ ను దాఖలు చేయడం కొత్త అనుమానాలకు తావిస్తోంది. మరోవైపు దీనిపై ఎటువంటి తీర్పు వస్తుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.