AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NIA Mega Crackdown: అక్రమ ఆయుధాల వ్యాపారులు, గ్యాంగ్‌స్టర్ల ఇళ్లలో ఎన్‌ఐఏ దాడులు.. ఏజెన్సీ చేతిలో కీలక సమాచారం..

దేశంలో పలుచోట్ల ఎన్‌ఐఏ దాడులు చేపట్టింది. పంజాబ్‌, హర్యానా, రాజస్థాన్‌, ఢిల్లీ, చండీగఢ్‌, యూపీ, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌లోని 70 చోట్ల ఏక కాలంలో తనిఖీలు చేపట్టారు. అక్రమ ఆయుధాల వ్యాపారులు, గ్యాంగ్‌స్టర్ల ఇళ్లలో ఎన్‌ఐఏ అధికారుల సోదాలు జరుగుతున్నాయి

NIA Mega Crackdown: అక్రమ ఆయుధాల వ్యాపారులు, గ్యాంగ్‌స్టర్ల ఇళ్లలో ఎన్‌ఐఏ దాడులు.. ఏజెన్సీ చేతిలో కీలక సమాచారం..
NIA
Sanjay Kasula
|

Updated on: Feb 21, 2023 | 9:08 AM

Share

దేశంలో పలుచోట్ల నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ( ఎన్ఐఏ)  దాడులు చేసింది. 70 ప్రాంతాలకుపైగా ఏకకాలంలో తనిఖీలు నిర్వహించింది. పంజాబ్‌, హర్యానా, రాజస్థాన్‌, ఢిల్లీ, చండీగఢ్‌, యూపీ, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌లో సోదాలు చేసింది. అక్రమ ఆయుధాల వ్యాపారులు, గ్యాంగ్‌స్టర్ల ఇళ్లలో ఎన్ఐఏ అధికారుల దాడులు నిర్వహించారు. గ్యాంగ్‌స్టర్ టెర్రర్ ఫండింగ్ కేసులకు సంబంధించి ఎన్ఐఏ మరింత దూకుడు పెంచింది. ఈసారి 70కి పైగా ప్రాంతాల్లో ఎన్‌ఐఏ బృందం దాడులు చేసింది. ఇందులో పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ, చండీగఢ్, పంజాబ్, గుజరాత్, మధ్యప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాలు ఉన్నాయి. గ్యాంగ్‌స్టర్, అతని సన్నిహితుల దాచిన స్థలంలో టెర్రర్ ఫండింగ్ గురించి ఈ దాడి జరిగింది.

ఈ దాడి అన్ని ప్రదేశాలలో ఏకకాలంలో నిర్వహించింది ఎన్ఐఏ. ఈ దాడుల్లో ఆరుగురు గ్యాంగ్‌స్టర్లను విచారించగా.. ఇంకా చాలా మంది గ్యాంగ్‌స్టర్ల పేర్లు తెరపైకి వచ్చినట్లు ఎన్ఐఏ వర్గాలు తెలిపాయి. ప్రశ్నించిన గ్యాంగ్‌స్టర్ల ఇళ్లు, వారితో సంబంధం ఉన్న ఇతర ప్రాంతాలపై, వారి సహచరులపై ఎన్‌ఐఏ దాడులు నిర్వహిస్తోంది. గ్యాంగ్‌స్టర్లకు ఇతర దేశాల్లో పరిచయాలు ఉన్నాయనే విషయం తెరపైకి వచ్చిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. లారెన్స్ బిష్ణోయ్, బవానా గ్యాంగ్ పేరుతో భారత్‌లో ఉగ్రదాడులకు భారీగా నిధులు సమకూరుతున్నట్లుగా తేలింది.

గ్యాంగ్‌స్టర్ నెక్సస్‌పై చర్య

చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (UAPA) కింద అరెస్టు చేసిన గ్యాంగ్‌స్టర్లందరినీ NIA విచారించింది. దీని తరువాత, పాకిస్తాన్-ఐఎస్ఐ, గ్యాంగ్‌స్టర్ నెక్సెస్ గురించి చాలా సమాచారం NIA చేతికి చిక్కింది. దీని ఆధారంగా గ్యాంగ్‌స్టర్ల రహస్య స్థావరాలపై మరోసారి దాడులు నిర్వహిస్తున్నారు.

ఏజెన్సీ చేతిలో కీలక సమాచారం

గ్యాంగ్‌స్టర్లను దేశ వ్యతిరేక కార్యకలాపాల కోసం ఏవిధంగా ఉపయోగించుకుంటున్నారనే దానిపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఆరా తీస్తోంది. ఎన్‌ఐఏ వర్గాల అందించిన సమాచారం ప్రకారం, గ్యాంగ్‌స్టర్-టెర్రర్ నిధుల కేసులో ఏజెన్సీ ఇప్పటి వరకు మూడు సార్లు దాడులు నిర్వహించింది. దీనికి ముందు కూడా, గత ఏడాది చివరిలో ఢిల్లీ-ఎన్‌సిఆర్‌తో సహా దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు జరిగాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!