కోయంబత్తూరులో ‘ ఐసిస్ ‘ కలకలం.. ఎన్ఐఏ తనిఖీలు..

తమిళనాడులోని కోయంబత్తూరులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అయిదు చోట్ల తనిఖీలు నిర్వహించింది. ఐసిస్ కేరళ, తమిళనాడు మోడ్యూల్ కేసుకు సంబంధించి ఎర్నాకుళంలోని ప్రత్యేక కోర్టు వారెంట్లు జారీ చేసిన నేపథ్యంలో ఈ తనిఖీలు జరిగాయి. ఓ ల్యాప్ టాప్, అయిదు మొబైల్ ఫోన్లు, నాలుగు సిమ్ కార్డులు, ఒక మెమొరీ కార్డు, 8 సీడీలను, పలు అనుమానాస్పద డాక్యుమెంట్లను అధికారులు ఈ తనిఖీల సందర్భంగా స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపనున్నారు. కొంతమంది అనుమానితులను […]

కోయంబత్తూరులో ' ఐసిస్ ' కలకలం.. ఎన్ఐఏ తనిఖీలు..
Follow us

|

Updated on: Dec 10, 2019 | 4:22 PM

తమిళనాడులోని కోయంబత్తూరులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అయిదు చోట్ల తనిఖీలు నిర్వహించింది. ఐసిస్ కేరళ, తమిళనాడు మోడ్యూల్ కేసుకు సంబంధించి ఎర్నాకుళంలోని ప్రత్యేక కోర్టు వారెంట్లు జారీ చేసిన నేపథ్యంలో ఈ తనిఖీలు జరిగాయి. ఓ ల్యాప్ టాప్, అయిదు మొబైల్ ఫోన్లు, నాలుగు సిమ్ కార్డులు, ఒక మెమొరీ కార్డు, 8 సీడీలను, పలు అనుమానాస్పద డాక్యుమెంట్లను అధికారులు ఈ తనిఖీల సందర్భంగా స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపనున్నారు. కొంతమంది అనుమానితులను కూడా అరెస్టు చేశామని, వీరికి ఐసిస్, జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయా అన్న విషయమై వీరిని ఇంటరాగేట్ చేస్తున్నామని వారు తెలిపారు. వీరిలో కొందరు శ్రీలంకలోని ఐసిస్, జైషే మహమ్మద్ నాయకుడు జహ్రాన్ హషిమ్ తోను, ఆతని సహచరులతోను సోషల్ మీడియా ద్వారా టచ్ లో ఉన్నట్టు తెలిసిందని వారు పేర్కొన్నారు. ఇలా ఉండగా-ఐసిస్ కేరళ-తమిళనాడు మోడ్యూల్ కేసులో 33 ఏళ్ళ మహమ్మద్ అజారుద్దీన్, 38 ఏళ్ళ షేక్ హిదయతుల్లాలను పోలీసులు అరెస్టు చేశారు. కోయంబత్తూరులో ఉగ్రవాద శిక్షణా శిబిరాలు లేవని భావిస్తున్నా.. శ్రీలంక లోని ఈ టెర్రరిస్టులతో అనుమానితులను లింక్ ఉండడం ఆందోళన కలిగిస్తోంది.

మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే