National: తొలి రాత్రే చివరి రాత్రి అయ్యింది.. శోభనం గదిలో విగత జీవులుగా కొత్త జంట.

|

Jun 05, 2023 | 10:43 AM

ఎన్నో కొత్త ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించింది ఆ జంట అయితే అంతలోనే అంతులేని విషాదం నిండిది. మొదటి రాత్రే వారికి చివరి రాత్రి అయ్యింది. ఈ విషాద సంఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్‌ జిల్లాకు చెందిన 24 ఏళ్ల ప్రతాప్‌ యాదవ్‌కు, 20 ఏళ్ల...

National: తొలి రాత్రే చివరి రాత్రి అయ్యింది.. శోభనం గదిలో విగత జీవులుగా కొత్త జంట.
Newly Married Couple
Follow us on

ఎన్నో కొత్త ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించింది ఆ జంట అయితే అంతలోనే అంతులేని విషాదం నిండిది. మొదటి రాత్రే వారికి చివరి రాత్రి అయ్యింది. ఈ విషాద సంఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్‌ జిల్లాకు చెందిన 24 ఏళ్ల ప్రతాప్‌ యాదవ్‌కు, 20 ఏళ్ల పుష్పతో వివాహం జరిగింది. వివాహ తంతు పూర్తయ్యాక శనివారం కొత్త జంటకు శోభనం ఏర్పాట్లు చేశారు పెద్దలు.

అయితే గదిలోకి వెళ్లే ముందు బాగానే ఉన్న కొత్త జంట, ఉదయం గది తలుపులు తెరిచి చూడగానే మంచంపై విగత జీవులుగా కనిపించారు. దీంతో దీనిని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దగ్గరల్లోని ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టంలో తెలిన వివరాల ప్రకారం కొత్త జంట మృతికి గుండెపోటు కారణంగా తెలిపింది.

 

ఈ విషయాన్ని జిల్లా ఎస్సీ అధికారికంగా వెల్లడించారు. ఇక ఇద్దరు నవ దంపతుల మృతదేహాలను ఒకే చోట దహన సంస్కారాలు నిర్వహించారు. ఈ సంఘటన గత నెల 30వ తేదీన జరిగింది. అప్పటి వరకు సంతోషంగా ఉన్న పెళ్లింట్లో ఇద్దరు మరణించడంతో విషాద సంఘటన చోటు చేసుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..