AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Operation Sindoor: భారత్‌ దాడిలో ధ్వంసమైన మురిద్ వైమానిక స్థావరం.. తాజా శాటిలైట్ చిత్రాల్లో స్పష్టమైన విధ్వంసం!

పహల్గామ్ ఉద్రదాడి తర్వాత ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా పాకిస్తాన్‌లోని మురిద్ వైమానిక స్థావరాతపై భారత్‌ చేసిన దాడిలో పాక్‌ వైమానిక దళ స్థావరానికి భారీ మొత్తంలో నష్టం జరిగినట్టు తాజాగా విడుదలైన ఉపగ్రహ చిత్రాలు ద్వారా తెలుస్తోంది. మే 23న తీసిన ఈ చిత్రాలను 'ది ఇంటెల్ ల్యాబ్'కు చెందిన జియో-ఇంటెలిజెన్స్ పరిశోధకుడు డామియన్ సైమన్ బయటపెట్టాడు.

Operation Sindoor: భారత్‌ దాడిలో ధ్వంసమైన మురిద్ వైమానిక స్థావరం.. తాజా శాటిలైట్ చిత్రాల్లో స్పష్టమైన విధ్వంసం!
Satellite Image
Anand T
|

Updated on: May 26, 2025 | 12:33 PM

Share

జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ‘ఆపరేషన్ సిందూర్‌” అనే సైనిక చర్యను ప్రారంభించింది. ఈ ఆపరేషన్‌లో భాగంగా పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని 9 ఉగ్రవాద స్థావరాలపై భారత దళాలు దాడులు చేసింది. భారత్‌ దాడుల్లో సుమారు 100 మందిదాకా ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే ఈ దాడి తర్వాత పాక్‌ మళ్లీ ప్రతీకార దాడులకు పాల్పడింది. ఈ క్రమంలో వాటిని తిప్పిటి కొట్టిన భారత్.. పాక్‌ పదే పదే ఇలాంటి దాడులు చేయకుండా నివారించేందుకు పాకిస్తాన్‌లోని ప్రధాన వైమానిక స్థావరాలపై దాడులు చేసింది.

భారత వైమానిక దళాలు చేసిన దాడిలో పాకిస్తాన్‌లోని నూర్ ఖాన్, రిఫికి, ముదిర్‌, చునియన్‌తో పాటు సుక్కూర్‌లోని పాకిస్థాన్ వైమానిక స్థావరాలు తీవ్రంగా దెబ్బతిన్నట్టు పాకిస్తాన్ మీడియా వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా భారత్‌ సరిహద్దుకు దగ్గరగా ఉండే మురిద్ వైమానిక స్థావరానికి భారీ మొత్తంలో నస్టం వాటిళ్లినట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఈ ఎయిర్‌ బేస్‌లోనే పాకిస్తాన్‌కు చెందిన అత్యాధునిక ఫైటర్ జెట్‌లు, డ్రోన్‌లు ఉన్నట్టు సమాచారం. ఈ ముదిర్‌ వైమానిక స్థావరంలో పాక్‌కు చెందిన షాపర్ 1, షాపర్ 2, బుర్రాక్, ఫాల్కో, బేరక్‌తార్ టీబీ2ఎస్, బేరక్‌తార్ అకింజీ, సీహెచ్-4, వింగ్ లూంగ్ 2 వంటి అత్యాధునిక డ్రోన్‌లు, ఆయుధాలు ఉన్నట్టు తెలుస్తోంది. కాగా భారత్‌ చేసిన దాడిలో ఇందులో చాలా మేర ధ్వంసంమైనట్టు తాజాగా విడుదలైన శాటిలైట్ చిత్రాల ద్వారా స్పష్టమవుతుంది.

అయితే, ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా పాకిస్తాన్‌లోని మురిద్ వైమానిక స్థావరంపై భారత్‌ చేసిన దాడిలో పాక్‌ వైమానిక దళ స్థావరానికి భారీ మొత్తంలో నష్టం జరిగినట్టు తాజాగా శాటిలైట్ చిత్రాలు విడుదలయ్యాయి. ఉపగ్రహం ద్వారా మే 23న తీయబడి ఈ చిత్రాలను ‘ది ఇంటెల్ ల్యాబ్’కు చెందిన జియో-ఇంటెలిజెన్స్ పరిశోధకుడు డామియన్ సైమన్ బయటపెట్టాడు. ఈ శాటిలైట్ చిత్రాల ప్రకారం.. భారత వైమానిక దళాలు జరిపిన దాడుల్లో మురిద్ ఎయిర్‌బేస్‌లోని ఒక కీలకమైన కమాండ్ కంట్రోల్ భవనం ధ్వంసమైనట్టు స్పష్టంగా కనిపిస్తోంది. అని డామియన్ సైమన్ తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..