‘జీరో బేస్డ్’‌ టైమ్ టేబుల్‌.. తగ్గనున్న రైలు ప్రయాణ సమయం

భారత రైల్వేలో భారీ మార్పులు జరగబోతున్నాయి. తాజాగా చోటు చేసుకుంటున్న మార్పుల ప్రకారం టైమ్‌ టేబుల్‌ను మొత్తం మార్చేందుకు రైల్వే శాఖ సిద్దమవుతోంది.

'జీరో బేస్డ్'‌ టైమ్ టేబుల్‌.. తగ్గనున్న రైలు ప్రయాణ సమయం
Follow us

| Edited By:

Updated on: Jul 05, 2020 | 5:20 PM

భారత రైల్వేలో భారీ మార్పులు జరగబోతున్నాయి. తాజాగా చోటు చేసుకుంటున్న మార్పుల ప్రకారం టైమ్‌ టేబుల్‌ను మొత్తం మార్చేందుకు రైల్వే శాఖ సిద్దమవుతోంది. ముఖ్యంగా ప్రయాణాల్లో జాప్యాన్ని నివారించేందుకు వీలుగా జీరో బేస్డ్‌ టైమ్‌ టేబుల్‌ని తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో ప్రయాణ సమయం తగ్గనుంది. దీనిపై రైల్వే బోర్డు చైర్మన్ వీకే యాదవ్ మాట్లాడుతూ.. ”జీరో బేస్డ్ టైమ్‌ టేబుల్‌ని ఎప్పుడో ప్రారంభించాల్సింది. కానీ కరోనా నేపథ్యంలో వాయిదా పడింది. కానీ త్వరలోనే ఈ టైమ్‌ టేబుల్‌ని ఇంప్లిమెంట్‌ చేస్తాం” అని అన్నారు. దీంతో దూర ప్రాంతాలకు వెళ్లే వారికి ప్రయాణ సమయం తగ్గనుంది. అలాగే ప్రయాణికుల సంఖ్యను బట్టి పలు స్టాప్‌లలో రైళ్లు ఆగనున్నాయి. ఈ క్రమంలో పాసింజర్‌ రైళ్లు ఎక్స్‌ప్రెస్‌లుగా మారనున్నాయి.