New Parliament Opening: కొత్త పార్లమెంట్ భవనాన్ని దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ మేరకు దేశంలోని జాతీయ కాంగ్రెస్ సహా మొత్తం 19 పార్టీలు మే 28న జరిగే కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవాన్ని బహిష్కరించాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బుధవారం నిర్ణయించాయి. దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కాదని, నూతన పార్లమెంట్ భవనాన్ని స్వయంగా ప్రారంభించాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారని ఆయా పార్టీలు పేర్కొన్నాయి. ఇది రాష్ట్రపతిని అవమానించడం, రాజ్యాంగ స్ఫూర్తిని ఉల్లంఘించడమని ఆరోపించాయి. మరోవైపు మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ కూడా తమ పార్టీ ఎంపీలు పార్లమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కావడంలేదని ప్రకటించారు. పార్లమెంట్ నూతన భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించకూడదని.. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రారంభించకపోతే తాము(ఏఐఎంఐఎం) ప్రారంభోత్సవ వేడుకలకు హాజరు కాబోమని అన్నారు.
మరోవైపు ఈ వేడుకలకు హాజరయ్యందుకు దేశంలోని బీజేపీ అనుకూల పార్టీలు, ఇంకా ఎన్డీయేతర పార్టీలు సుముఖంగా ఉన్నాయి. ఈ క్రమంలో ఏయే పార్టీలు పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవ వేడుకలకు బహిష్కరించాయో.. ఏ పార్టీలు హాజరు కాబోతున్నాయో.. వాటి జాబితా ఇక్కడ ఉంది.
తృణమూల్ కాంగ్రెస్(TMC); ద్రవిడ మున్నేట్ర కళగం(DMK); జనతాదళ్ (యునైటెడ్); ఆమ్ ఆద్మీ పార్టీ (AAP); నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP); శివసేన(ఉద్ధవ్ థాక్రే); కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్); సమాజ్ వాదీ పార్టీ (SP); రాష్ట్రీయ జనతాదళ్(RJD); కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా(CPI); ముస్లిం లీగ్; జార్ఖండ్ ముక్తి మోర్చా(JMM); నేషనల్ కాన్ఫరెన్స్; కేరళ కాంగ్రెస్(ఎం); రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ(RSP); మరుమలార్చి ద్ర విడ మున్నేట్ర కళగం (MDMK); విదుతలై చిరుతైగల్ కట్చి (VCK); రాష్ట్రీయ లోక్ దళ్ (RLD).. ఇక్కడ మరో విషయం ఏమిటంటే-పార్లమెంటు ఉభయ సభల్లో ఈ పార్టీలకు మొత్తం కలిపి 242 మంది ఎంపీలు ఉన్నారు.
ప్రారంభోత్సవానికి హాజరయ్యేందుకు అంగీకరించిన పార్టీలలో.. భారతీయ జనతా పార్టీ(BJP); శివసేన (ఏక్నాథ్ షిండే వర్గం); రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ(RLJP); బహుజన్ సమాజ్ పార్టీ(BSP); నేషనల్ పీపుల్స్ పార్టీ (NCP); నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (NDPP); సిక్కిం క్రాంతికారీ మోర్చా(SKM); రాష్ట్రీయ లోక్ జనసేన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ(YSRCP); తెలుగుదేశం పార్టీ(TDP); శిరోమణి అకాలీదళ్(SAD); బిజు జనతాదళ్ (BJD); జనతాదళ్ సెక్యూలర్(JDS) వంటి పార్టీలు ఉన్నాయి. కాగా, ఇందులో YSRCP, TDP, BJD, RLJP, BSP వంటి పలు పార్టీలు ఎన్డీయేతర పార్టీలు అయి ఉండి కూడా ప్రారంభోత్సవానికి సుముఖంగా ఉండడం గమనార్హం.
మరిన్ని జాతీయ వార్తల కోసం