Crime: కన్న తల్లిని చంపి.. 77 పేజీల సూసైడ్ నోట్ రాసి యువకుడి ఆత్మహత్య! ఆ సూసైడ్ నోట్‌లో ఏముందంటే..
దేశ రాజధానిలో దారుణం చోటుచేసుకుంది. నవమాసాలు మోసి, కని, పెంచిన తల్లిని అత్యంత కిరాతకంగా చంపాడు ఓ కొడుకు. ఏమైందో అంతలోనే తన గొంతు తానే కోసుకుని ఏకంగా 77 పేజీల సూసైడ్ నోట్ రాసిమరీ ఆత్మహత్య చేసుకున్నాడు..

Delhi Crime News: దేశ రాజధానిలో దారుణం చోటుచేసుకుంది. నవమాసాలు మోసి, కని, పెంచిన తల్లిని అత్యంత కిరాతకంగా చంపాడు ఓ కొడుకు. ఏమైందో అంతలోనే తన గొంతు తానే కోసుకుని ఏకంగా 77 పేజీల సూసైడ్ నోట్ రాసిమరీ ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెల్పిన వివరాల ప్రకారం.. క్షితిజ్ అనే 25 యేళ్ల యువకుడి తండ్రి చిన్న తనంలోనే మరణించాడు. వితంతువైన తన తల్లి మిథిలేశ్‌ను 3 మూడు రోజుల (గురువారం) క్రితం హత్య చేసి బాత్రూంలో ఉంచాడు. సెప్టెంబర్ 4 (ఆదివారం) క్షితిజ్ 77 పేజీల సూసైడ్ నోట్ రాసి కత్తితో గొంతుకోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఐతే వీరు నివాసముంటున్న ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు సోమవారం రాత్రి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇంటి తలుపుకి లోపలి నుంచి గడియ పెట్టి ఉండటంతో.. బాల్కనీ నుంచి తలుపులు పగులగొట్టి లోపలికి ప్రవేశించిన పోలీసులు ఒక్కకసారిగా షాక్‌కు గురయ్యారు. రక్తపు మడుగులో మృతి చెందిన స్థితిలో క్షితిజ్ కనిపించగా, బాత్‌రూమ్‌లో అతని తల్లి మృతదేహాం కుళ్లిపోయిన స్థితిలో కనిపించిందని రోహిణి డీసీపీ ప్రణవ్ త్యాల్ మీడియాకు తెలిపారు. ఉద్యోగంలేనందున డిప్రెషన్‌లో ఉన్నానని, జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్‌లో తెలిపాడు. ఘటనా స్థలంలో ఫోరెన్సిక్ నిపుణులు ఆధారాలు సేకరించారని, అనుమానాస్పదంగా ఆ ఇంట్లో ఏమీకనిపించలేదని డీసీపీ వెల్లడించారు. మృతులకు సంబంధించిన బంధువులను విచారిస్తే మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉందని అన్నారు.