Crime Viral video: ఎంత దారుణం..! వెండి కడియాల కోసం వృద్ధురాలి కాళ్లు నరికేశారు.. ఎక్కడంటే..
రాజస్తాన్‌లో దారుణం జరిగింది. వెండి కడియాల కోసం వృద్ధురాలి కాళ్లు నరికేశారు దుండగులు. బూండిలోని నైన్‌వాన్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.
రాజస్తాన్‌లో దారుణం జరిగింది. వెండి కడియాల కోసం వృద్ధురాలి కాళ్లు నరికేశారు దుండగులు. బూండిలోని నైన్‌వాన్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. తన పొలంలో నివసిస్తున్న ఓ వృద్ధురాలిపై అర్థరాత్రి సమయంలో దాడి చేశారు దుండగులు. కాలికున్న వెండి కడియాలు రాకపోవడంతో పాదాలు నరికి మరీ వెండి ఆభరణాలను దోచుకెళ్లారు. బాధితురాలు నైన్‌వాన్‌లోని ఓ జర్నలిస్ట్ తల్లిగా గుర్తించారు. దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమెను హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఐప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. దీంతో ఆమెను మెరుగైన వైద్యం కోసం కోటా ఆస్పత్రికి తరలించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Published on: Sep 06, 2022 09:57 AM
వైరల్ వీడియోలు
Latest Videos