KIIT University: కీట్ వర్సిటీలో కలకలం.. మరో నేపాలి విద్యార్థిని సూసైడ్.. అసలేం జరుగుతోంది..?
ఈ విషయంలో ఒడిశా ప్రభుత్వంతో సంప్రదిస్తున్నామని తెలిపింది. ఇదిలా ఉంటే.. దేశంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన ఈ విద్యా సంస్థలో క్లాస్‌మేట్ బ్లాక్‌మెయిల్ చేశాడనే ఆరోపణలతో 20 ఏళ్ల నేపాలీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న మూడు నెలల లోపే ఇదే క్యాంపస్‌లో మరోమారు విద్యార్థిని సూసైడ్ చేసుకోవటం తీవ్ర కలకలం రేపుతోంది.

ఒడిశాలోని భువనేశ్వర్‌లో గల కళింగ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ (కీట్)లో నేపాలీ విద్యార్థిని ప్రిషా షా (21) ఆత్మహత్య చేసుకుంది. విద్యార్థిని కంప్యూటర్ సైన్స్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. అయితే గురువారం రాత్రి హాస్టల్‌లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. యువతి మృతికి గల కారణాలు తెలియలేదు. ప్రస్తుతం మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులకు సమాచారం అందించారు. యూనివర్సిటీ హాస్టల్‌ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
జరిగిన సంఘటనపై నేపాలీ రాయబార కార్యాలయం విచారం వ్యక్తం చేసింది. ఈ విషయంలో ఒడిశా ప్రభుత్వంతో సంప్రదిస్తున్నామని తెలిపింది. ఇదిలా ఉంటే.. దేశంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన ఈ విద్యా సంస్థలో క్లాస్‌మేట్ బ్లాక్‌మెయిల్ చేశాడనే ఆరోపణలతో 20 ఏళ్ల నేపాలీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న మూడు నెలల లోపే ఇదే క్యాంపస్‌లో మరోమారు విద్యార్థిని సూసైడ్ చేసుకోవటం తీవ్ర కలకలం రేపుతోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…




