Navjot Singh Sidhu: నవజ్యోత్ సింగ్ సిద్ధూ తొలిరోజు జైల్లో..ఏం జరిగిందంటే..? ఆయన లాయర్ చెప్పిన నిజాలు..!
పీపీసీసీ మాజీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్దూ జైలుకు వెళ్లి 24గంటలు పూర్తైంది. శనివారం సాయంత్రం నాటికి దాదాపు 24 గంటలపాటు ఆయన జైల్లోనే ఉన్నారు. నవజ్యోత్ సింగ్ సిద్దూకు జైలు అధికారులు
పీపీసీసీ మాజీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్దూ జైలుకు వెళ్లి 24గంటలు పూర్తైంది. శనివారం సాయంత్రం నాటికి దాదాపు 24 గంటలపాటు ఆయన జైల్లోనే ఉన్నారు. నవజ్యోత్ సింగ్ సిద్దూకు జైలు అధికారులు చపాతీలు, పప్పు పెట్టారని వివరించారు సిద్ధూ లాయర్ హెచ్‌పిఎస్ వర్మ. కానీ, నవజ్యోత్ సింగ్ సిద్దూకు గోధుమ అలెర్జీ అని, ఆయన ఒంటికి గోధుమలు పడవని చెప్పారు. అందుకే ఆయన ఆహారం ముట్టలేదని తెలిపారు.సిద్ధూ ఆరోగ్య పరిస్థితులకు అనుగుణంగా ఆహారం అందించాలని పాటియాలా కోర్టులో న్యాయవాది హెచ్‌పిఎస్ వర్మ విజ్ఞప్తి చేశారు. అయినా ఇప్పటి వరకు అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. తాను ఉదయం నుండి జైలు అధికారుల కోసం ఎదురుచూస్తూ ఇదే కోర్టులో కూర్చున్నానని చెప్పారు. కానీ, ఏ ఒక్కరు కూడా రాలేదని లాయర్ హెచ్‌పీఎస్ వర్మ తెలిపారు.
ఇదిలా ఉంటే, 1988 నాటి రోడ్ రేజ్ కేసులో సిద్ధూకి సుప్రీంకోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం, పంజాబ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూకు ఒక టేబుల్, ఒక కుర్చీ, రెండు తలపాగాలు, ఒక అల్మారా, ఒక దుప్పటి, మూడు సెట్ల లోదుస్తులు, రెండు టవల్స్, ఒక దోమ తెర, ఒక పెన్, ఒక నోట్‌బుక్, ఒక జత బూట్లు, రెండు బెడ్ షీట్లు, నాలుగు జతల కుర్తా పైజామాలు, రెండు దిండు కవర్లు పాటియాలా సెంట్రల్ జైలులో ఇచ్చారు.
అతని ఖైదీ నంబర్ 241383. నవజ్యోత్ సింగ్ సిద్ధూకు బ్యారక్ నంబర్ 7గా కేటాయించబడిందని వర్గాలు తెలిపాయి. గతంలో 2018 మార్చిలో రూ. 1,000 జరిమానాతో సిద్ధూను విడిచిపెట్టారు. ఇప్పుడు, IPC సెక్షన్ 323 ప్రకారం గరిష్టంగా పడాల్సిన శిక్ష సిద్ధూకి విధించబడింది. పాటియాలా నివాసి గుర్నామ్ సింగ్ మరణించిన 34 ఏళ్ల నాటి రోడ్ రేజ్ కేసులో అతనిని నిర్దోషిగా చేస్తూ మే 2018లో ఇచ్చిన ఉత్తర్వులను సమీక్షించడానికి సుప్రీంకోర్టు గతంలో అనుమతించింది.