Engineering: నీట్ లాగే ఇంజనీరింగ్‌కు కూడా జాతీయ ఉమ్మడి ప్రవేశపరీక్ష.. చర్చలు జరుపుతున్న కేంద్రం

|

Apr 22, 2023 | 9:23 AM

దేశవ్యాప్తంగా ఒకే ప్రవేశపరీక్ష విధానాన్ని అమలు చేస్తున్న కేంద్రం నీట్ తరహాలోలనే ఇంజీనిరింగ్ కూడా జాతీయ స్థాయిలో ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించాలని యోచిస్తోంది. దేశంలో ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి 2016 నుంచి నీట్ నిర్వహిస్తుండగా.. గత ఏడాది నుంచి కేంద్రీయ విశ్వవిద్యాలయ్యాల్లో డిగ్రీ, పీజీ సీట్ల భర్తీకీ కామన్ యూనివర్శిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ) ని ప్రవేశపెట్టింది.

Engineering: నీట్ లాగే ఇంజనీరింగ్‌కు కూడా జాతీయ ఉమ్మడి ప్రవేశపరీక్ష.. చర్చలు జరుపుతున్న కేంద్రం
Students
Follow us on

దేశవ్యాప్తంగా ఒకే ప్రవేశపరీక్ష విధానాన్ని అమలు చేస్తున్న కేంద్రం నీట్ తరహాలోలనే ఇంజీనిరింగ్ కూడా జాతీయ స్థాయిలో ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించాలని యోచిస్తోంది. దేశంలో ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి 2016 నుంచి నీట్ నిర్వహిస్తుండగా.. గత ఏడాది నుంచి కేంద్రీయ విశ్వవిద్యాలయ్యాల్లో డిగ్రీ, పీజీ సీట్ల భర్తీకీ కామన్ యూనివర్శిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ) ని ప్రవేశపెట్టింది. అయితే 2023-24 విద్యా సంవత్సరం నుంచి 57 కేంద్ర, రాష్ట్ర విద్యాసంస్థల్లో ప్రవేశపెట్టనున్న నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ సీట్లను కూడా జాతీయ ప్రవేశపరీక్ష ద్వారానే నింపుతామని ఇప్పటికే కేంద్రం ప్రకటించింది. అలాగే అన్ని రాష్ట్రాల్లోని బీటెక్‌ సీట్ల భర్తీకి కూడా జాతీయస్థాయి ప్రవేశపరీక్ష జరపాలని 2016 నుంచే కేంద్రం ఆలోచిస్తోంది. ఎన్‌ఐటీల్లో సీట్ల భర్తీకి 2013 నుంచి జేఈఈ మెయిన్‌ నిర్వహిస్తున్న నేపథ్యంలో.. ఆ పరీక్షలో అన్ని రాష్ట్రాలు చేరితే ఇంజినీరింగ్‌ ప్రవేశాలకు వినియోగించుకోవచ్చన్నది ఆలోచన. ఇందుకు సంబంధించి అప్పట్లోనే కేంద్రం అన్ని రాష్ట్రాలకూ లేఖలు కూడా రాసింది. ఆ తర్వాత ఈ అంశం మరుగున పడింది.

ఈనెల 18న భువనేశ్వర్‌ ఐఐటీలో.. ఐఐటీ కౌన్సిల్‌ సమావేశం జరిగింది. దేశంలోని 23 మంది ఐఐటీల డైరెక్టర్లు, గవర్నింగ్‌ బాడీ ఛైర్మన్లు, యూజీసీ, ఏఐసీటీఈ ఛైర్మన్లతో పాటు ఐఐటీ కౌన్సిల్‌ ఛైర్మన్‌గా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఈ సమావేశానికి హాజరయ్యారు. ఎజెండాలో భాగంగా ఇంజినీరింగ్‌కు ఉమ్మడి ప్రవేశపరీక్ష నిర్వహించే అంశంపై సమావేశంలో చర్చ జరిగింది. ఈ అంశంపై సానుకూలతలు, ప్రతికూలతలను లోతుగా అధ్యయనం చేసి సాధ్యాసాధ్యాలపై నివేదిక సమర్పించాలని కేంద్రమంత్రి కోరినట్లు ఐఐటీ గవర్నింగ్‌ బాడీ ఛైర్మన్‌ తెలిపారు. ఈమేరకు ఉమ్మడి ప్రవేశపరీక్షపై చర్చ కొనసాగుతోందన్నారు. ఒక విధానం నుంచి మరో విధానానికి మారాలంటే కొంత సమయం పడుతుందని, చివరి నిర్ణయం తీసుకున్న అనంతరం ఉమ్మడి ప్రవేశపరీక్షకు రెండు లేదా మూడేళ్ల సమయం ఇస్తామని వివరించారు

అయితే ఒకవేళ ఈ విషయంపై తుది నిర్ణయానికి వస్తే.. 2025-26 నుంచి అమలయ్యే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. అలాగే ఐఐటీల్లో సీట్ల భర్తీకి ప్రస్తుతం జరుపుతున్న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ను రద్దుచేసి దాన్ని కూడా ఉమ్మడి ఇంజినీరింగ్‌ ప్రవేశపరీక్షలోకి తీసుకురావాలన్న అంశం కూడా చర్చకు రాగా ఎక్కువ మంది డైరెక్టర్లు, ఛైర్మన్లు అభ్యంతరం చెప్పినట్లు సమాచారం. దానివల్ల ఐఐటీల్లో నాణ్యత తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తమైనట్లు తెలుస్తోంది. మరోవైపు నీట్‌, జేఈఈ మెయిన్‌లను కూడా సీయూఈటీలో విలీనం చేయాలని కేంద్రం భావిస్తోంది. యూజీసీ ఛైర్మన్‌ ఆచార్య జగదీష్‌కుమార్‌ స్వయంగా ఈ విషయాన్ని పలుమార్లు ప్రకటించారు. ఒకవేళ ఇది సాధ్యం కాకుంటే ఇంజినీరింగ్‌కు ప్రత్యేకంగా జాతీయ ఉమ్మడి ప్రవేశపరీక్ష నిర్వహించాలని కేంద్రం ఆలోచిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..