అమ్మో బాబోయ్.. 300 మందిని హత్య చేశాడు.. ఎందుకో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

తమిళనాడులో దాదాపు 300 మంది రోగులను హత్య చేసిన ఘటన దుమారం రేపుతోంది. పది సంవత్సరాలుగా ఈ హత్యలు చేస్తున్న నిందితుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఆ నిందితుడు హత్యల విషయంపై చెప్పిన వీడియో ప్రస్తుతం నెట్టింటా వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే నామక్కల్ జిల్లా పళ్లి పాలయానికి చెందిన మోహన్ రాజ్ (34) అనే వ్యక్తి స్థానిక ప్రభుత్వాసుపత్రి వద్ద నిత్యం సంచరిస్తూ ఉండేవాడు.

అమ్మో బాబోయ్.. 300 మందిని హత్య చేశాడు.. ఎందుకో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
Death
Follow us
Aravind B

|

Updated on: Apr 22, 2023 | 8:54 AM

తమిళనాడులో దాదాపు 300 మంది రోగులను హత్య చేసిన ఘటన దుమారం రేపుతోంది. పది సంవత్సరాలుగా ఈ హత్యలు చేస్తున్న నిందితుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఆ నిందితుడు హత్యల విషయంపై చెప్పిన వీడియో ప్రస్తుతం నెట్టింటా వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే నామక్కల్ జిల్లా పళ్లి పాలయానికి చెందిన మోహన్ రాజ్ (34) అనే వ్యక్తి స్థానిక ప్రభుత్వాసుపత్రి వద్ద నిత్యం సంచరిస్తూ ఉండేవాడు. అయితే శవాగారం వద్ద పనిచేస్తున్న వ్యక్తితో ఆ నిందితుడు ఉండేవాడు. అతడు చెప్పిన పనులు చేస్తుండేవాడు. ఈ క్రమంలోనే 18వ తేదిన సామజిక మాధ్యమాల్లో తాను హత్యలు చేసినట్లు ఒప్పుకున్న వీడియో బయటకొచ్చింది. అయితే అతను ఎందుకు ఇలా చేశాడో కూడా వివరించాడు. వయోభారం, ఆరోగ్యం క్షీణించిన రోగులకు వారి కుటుంబ సభ్యులు, బంధువుల కొరిక మేరకు సూదితో విషపు మందు వేసి హత్య చేసినట్లు తెలిపాడు. ఇందుకోసం రూ.5 వేలు కూడా తీసుకుంటున్నట్లు పేర్కొన్నాడు.

ఇలా దాదాపు పది సంవత్సరాల్లో 300 మందిని హత్య చేసినట్లు తెలిపాడు. ఇలాంటి పనులు చేసేందుకు చెన్నై, బెంగళూరు కూడా వెళ్లినట్లు పేర్కొన్నాడు. డబ్బులు ఇస్తే రెండు నిమిషాల్లో పని పూర్తి చేస్తానని తెలిపాడు. అయితే అతను చెప్పిన వీడియో వైరల్ కావడంతో పోలీసుల దృష్టికి వచ్చింది. వెంటనే పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. అయితే మద్యం మత్తులో తాను ఆలా మట్లాడినట్లు ఆ నిందితుడు దర్యాప్తులో పేర్కొన్నాడు. అలాగే ఇప్పటివరకు 18 మంది నకిలీ వైద్యులతో పాటు మరో ఇద్దరు నిందితుల్ని కూడా అరెస్టు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!