PM Modi: ఈ సెల్ఫీ నాకెంతో ప్రత్యేకం.. ప్రధాని మోదీ ఇంట్రెస్టింగ్ ట్వీట్.
అయితే ఆర్టికల్ 370 రద్దు తర్వాత ప్రధని కశ్మీర్ వెళ్లడం ఇదే తొలిసారి కావడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ పర్యటనలో భాగంగా శ్రీనగర్‌లో రూ.6400 కోట్ల అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. అనంతరం శ్రీనగర్‌లోని స్టేడియంలో వికసిత్ భారత్ వికసిత్ కశ్మీర్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు....
ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా పర్యటనలు చేపడుతున్నారు. పలు రాష్ట్రాల్లో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవంతో పాటు, ఎన్నికల ప్రచారాలను నిర్వహిస్తున్నారు. నిన్న, మొన్నటి వరకు దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటించిన ప్రధాని తాజాగా కశ్మీర్ వెళ్లారు. గురువారం ప్రధాని కశ్మీర్ పర్యటలో బిజీగా ఉన్నారు.
అయితే ఆర్టికల్ 370 రద్దు తర్వాత ప్రధని కశ్మీర్ వెళ్లడం ఇదే తొలిసారి కావడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ పర్యటనలో భాగంగా శ్రీనగర్‌లో రూ.6400 కోట్ల అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. అనంతరం శ్రీనగర్‌లోని స్టేడియంలో వికసిత్ భారత్ వికసిత్ కశ్మీర్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇక కశ్మీర్‌ను పర్యాటక రంగం అభివృద్ధి కోసం స్వదేశ్ దర్శన్, ప్రసాద్ పథకంలో భాగంగా రూ. 1400 కోట్లు ఖర్చు చేయనున్నారు.
ఇదిలా ఉంటే ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు లభించాయి. తాజాగా ఉద్యోగాలు పొందిన వెయ్యి మందికి అపాయింట్ మెంట్ లెటర్లను ప్రధాని మోదీ అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వికసిత్ భారత్ ప్రోగ్రామ్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వ పథకాలతో లబ్ధి పొందిన పలువురితో ప్రధాని మాట్లాడారు. ఈ సందర్భంగా నజీమ్ అనే యువకుడు మోదీతా ముచ్చటించారు.
A memorable selfie with my friend Nazim. I was impressed by the good work he’s doing. At the public meeting he requested a selfie and was happy to meet him. My best wishes for his future endeavours. pic.twitter.com/zmAYF57Gbl
— Narendra Modi (@narendramodi) March 7, 2024
డిజిటల్ ఎకానమీ, డిజిటల్ లావాదేవీలతో తమ జీవితాలు ఎలా మారాయో ఆ యువకుడు వివరించిన తీరుకు ప్రధాని ఫిదా అయ్యారు. సభ ముగిసిన తర్వాత నజీమ్ సెల్ఫీ అడగగా ప్రధాని అందుకు అంగీకరించారు. ఇక ఆ ఫొటోను మోదీ స్వయంగా తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. నజీమ్‌తో దిగిన ఫొటోను పోస్ట్ చేస్తూ.. ‘నా స్నేహితుడు నజీమ్‌తో దిగిన ఈ సెల్ఫీ నాకెంతో ప్రత్యేకం, నేను ఎప్పటికీ మర్చిపోలేనేది. అతను చేస్తున్న మంచి పని నన్ను ఎంతో ఇంప్రెస్ చేసింది. నజీమ్‌ను కలవడం నాకు సంతోషంగా ఉంది. అతనికి నా బెస్ట్ విషెస్’ అంటూ రాసుకొచ్చారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..