Lakhimpur Kheri violence: అట్టుడుకుతున్న లఖింపూర్ ఖేరీ.. కేంద్ర మంత్రి, ఆయన కుమారుడిపై మర్డర్ కేసు..

|

Oct 04, 2021 | 10:34 AM

Lakhimpur Kheri violence: ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరిలో నిరసన తెలుపుతున్న రైతులపై కేంద్ర మంత్రి కారు దూసుకెళ్లిన ఘటనలో నలుగురు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన అనంతరం

Lakhimpur Kheri violence: అట్టుడుకుతున్న లఖింపూర్ ఖేరీ.. కేంద్ర మంత్రి, ఆయన కుమారుడిపై మర్డర్ కేసు..
Lakhimpur Kheri Violence
Follow us on

Lakhimpur Kheri violence: ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరిలో నిరసన తెలుపుతున్న రైతులపై కేంద్ర మంత్రి కారు దూసుకెళ్లిన ఘటనలో నలుగురు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన అనంతరం చెలరేగిన హింసలో మరో నలుగురు వ్యక్తులు మరణించారు. కాగా.. లఖింపూర్ ఖేరీ ఘటనకు సంబంధించి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్, ఆయన కుమారుడు ఆశిష్ మిశ్రాపై హత్య కేసు నమోదైంది. రైతుల ఫిర్యాదు మేరకు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్ఐఆర్) లో కేంద్రమంత్రి, అతని కుమారుడితోపాటు పలువురు వ్యక్తుల పేర్లు కూడా నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఆశిష్ మిశ్రాను నడుపుతున్న కారు నిరసనకారుల గుంపుపైకి దూసుకెళ్లినట్లు రైతు సంఘాలు ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నాయి. కేంద్రమంత్రి ఏకే మిశ్రాను పదవి నుంచి భర్తరఫ్ చేయాలని.. కేంద్రమంత్రి, అతని కుమారుడిపై కేసునమోదు చేయాలని, మరణించిన వారి కుటుంబానికి ఎక్స్ గ్రేషియాతోపాటు వారి కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని, నిన్న జరిగిన సంఘటనపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ.. రైతులు తనకు మెమోరాండం ఇచ్చినట్లు లఖింపూర్ ఖేరి కలెక్టర్ ఏకే చౌరసియా తెలిపారు. ఈ సంఘటనలో పాల్గొన్న వారందరిపై హత్య కేసు నమోదు చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా డిమాండ్ చేసింది. కాగా.. దీనిపై టికోనియా పోలీసులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాపై హత్యా కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారని అధికారులు తెలిపారు.

లఖింపూర్ ఖేరీ ఘటన అనంతరం యూపీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఘటనా స్థలికి వెళుతున్నట్లు ప్రతిపక్షాలు పేర్కొనండంతో లఖింపూర్ ఖేరీ ప్రాంతంలో 114 సెక్షన్ విధించారు. దీంతోపాటు పాఠశాలలకు సెలవులు ప్రకటించి భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. ఉదయం కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీని పోలీసులు అరెస్ట్ చేశారు. లక్నోలో సమాజ్ వాదీ పార్టీ నేత, మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌ను సైతం పోలీసుుల గృహనిర్భంధం చేశారు.

Also Read:

Priyanka Gandhi Vadra: ‘ఈ దేశం రైతులది’.. పోలీసుల అదుపులో ప్రియాంక గాంధీ.. యూపీలో కొనసాగుతున్న ఉద్రిక్తత..

National News: దేశవ్యాప్తంగా అనూహ్య ఘటనలు.. జాతీయవార్తల సమాహారం. నేటి నేషనల్ రౌండప్. టూకీగా..