Mundra Drug Case: ముంద్రా ఎయిర్‌పోర్ట్‌ డ్రగ్స్ కేసులో సంచలనం.. ఎన్‌ఐఏ చార్జ్‌షీట్‌‌లో తెలుగు వ్యక్తి పేరు..!

|

Feb 21, 2023 | 8:29 AM

ఇప్పుడు వరకూ లేని ఓ కొత్త కోణం.. ఊహకు కూడా అందని ఓ పచ్చినిజం.. ఎన్ఐఏ తన చార్జ్‌షీట్‌లో పేర్కొంది. అది కూడా విజయవాడకు సంబంధించిన వారి పేరు ఎంటరైంది.

Mundra Drug Case: ముంద్రా ఎయిర్‌పోర్ట్‌ డ్రగ్స్ కేసులో సంచలనం.. ఎన్‌ఐఏ చార్జ్‌షీట్‌‌లో తెలుగు వ్యక్తి పేరు..!
NIA
Follow us on

ఇప్పుడు వరకూ లేని ఓ కొత్త కోణం.. ఊహకు కూడా అందని ఓ పచ్చినిజం.. ఎన్ఐఏ తన చార్జ్‌షీట్‌లో పేర్కొంది. అది కూడా విజయవాడకు సంబంధించిన వారి పేరు ఎంటరైంది. అవును, ఇందులో కాకినాడకు చెందిన వ్యక్తి, విజయవాడ కేంద్రంగా బిజినెస్ చేస్తున్న మాచవరం సుధాకర్ పేరు కూడా ఉంది. మీకు గుర్తుందో లేదో.. 2021 సెప్టెంబర్‌లో గుజరాత్‌లోని ముంద్రా పోర్ట్‌లో 3వేల కేజీల హెరాయిన్ పట్టుబడిన విషయం తెలిసిందే. టాల్కమ్‌ పౌడర్‌ ముసుగులో జరిగిన దిగుమతి ఇది. ఇంతలా టాల్కమ్‌ పౌడర్‌ని ఇంపోర్ట్ చేసుకుంటోంది ఎవరో అని ఆరా తీస్తే విజయవాడలోని సత్యనారాయణపురం.. గడియారం వీధి అడ్రస్‌పేరుతో ఓ కంపెనీ రిజిస్ట్రర్ అయ్యి ఉంది. ఆ కంపెనీ పేరే ఆషీ ఎంటర్‌ ప్రైజెస్‌. దీని ఓనర్లుగా ఉన్న వ్యక్తులు మాచవరం సుధాకర్‌, ఆయన భార్య వైశాలి. ఆషి సంస్థపై అప్పట్లో ఎన్ఐఏ దాడులు చేసి ఈ మొత్తం వివరాలను సేకరించింది.

ముంద్రా డ్రగ్స్‌ కేసులో ప్రధాన నిందితుడు హర్‌ప్రీత్‌ తల్వార్. హరిప్రీత్‌కి ఇంటర్నేషనల్‌ ఇంపోర్ట్స్‌ అండ్‌ ఎక్స్‌పోర్ట్స్‌కు సంబంధించి లైసెన్స్‌ లేదు. అందుకు టాల్కమ్‌ పౌడర్ బిజినెస్‌ చేస్తున్న మాచవరం సుధాకర్‌ లైసెన్స్‌ను వాడుకున్నారా? ఇదంతా సుధాకర్‌కి తెలిసే జరిగిందా? అరెస్ట్‌కు ముందు వరకూ ఆషీ ఎంటర్‌ప్రైజెస్ ద్వారా ఎన్ని కిలోలు, టన్నుల మేర టాల్కమ్‌ పౌడర్ వచ్చింది. అందులో మిక్సై వచ్చిన డ్రగ్స్ ఎన్ని కేజీలు? ఈ వచ్చిన ఆదాయం ఎంత.. లష్కరే తోయిబాకు తరలింది ఎంత? ఎన్ఐఏ చార్జ్‌షీట్‌తో ఒక్కసారిగా తెరపైకి వచ్చిన అనుమానాలివి.

మొత్తంగా ఆఫ్గన్ డ్రగ్స్‌ గుజరాత్‌ పోర్టు నుంచి ఇండియాలోకి ఇంపోర్ట్ అవుతున్నాయి. అందుకు సహకరిస్తోంది విజయవాడకు చెందిన కంపెనీ. డ్రగ్స్‌పై వచ్చిన ఆదాయం పాకిస్థాన్‌లోని టెర్రరిస్ట్‌లకు వెళ్తోంది. టోటల్‌గా అతిపెద్ద మిస్టరీని చేదించింది ఎన్ఐఏ.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..