Crime News: విషాదం.. ఉపాధ్యాయురాలి ప్రాణం తీసిన లిఫ్ట్.. క్లాస్ ముగించుకుని అడుగు పెట్టగానే..

ఉపాథ్యాయురాలు జెనెల్ ఫెర్నాండెజ్‌ క్లాస్ ముగిసిన తర్వాత.. మధ్యాహ్నం 1 గంటల సమయంలో రెండో అంతస్తులోని స్టాఫ్ రూమ్‌కు వెళ్లేందుకు ఆరో అంతస్తులో వేచి ఉంది. అయితే టీచర్‌ లిఫ్ట్‌లోకి ఒక కాలు పెట్టిన వెంటనే

Crime News: విషాదం.. ఉపాధ్యాయురాలి ప్రాణం తీసిన లిఫ్ట్.. క్లాస్ ముగించుకుని అడుగు పెట్టగానే..
Crime News

Updated on: Sep 17, 2022 | 9:30 PM

Woman Teacher Dead: మహారాష్ట్ర రాజధాని ముంబై నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పాఠశాల లిఫ్ట్‌లో ఇరుక్కుని 26 ఏళ్ల ఉపాధ్యాయురాలు ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన ఉత్తర ముంబైలోని శివారు ప్రాంతమైన మలాడ్‌లో చోటుచేసుకుంది. చించోలి బందర్‌లోని సెయింట్ మేరీస్ ఇంగ్లీష్ హైస్కూల్‌లో శుక్రవారం ఈ సంఘటన జరిగిందని అధికారులు తెలిపారు. మృతురాలు జెనెల్ ఫెర్నాండెజ్‌గా గుర్తించారు. ఉపాథ్యాయురాలు జెనెల్ ఫెర్నాండెజ్‌ క్లాస్ ముగిసిన తర్వాత.. మధ్యాహ్నం 1 గంటల సమయంలో రెండో అంతస్తులోని స్టాఫ్ రూమ్‌కు వెళ్లేందుకు ఆరో అంతస్తులో వేచి ఉంది. అయితే టీచర్‌ లిఫ్ట్‌లోకి ఒక కాలు పెట్టిన వెంటనే డోర్లు దగ్గరకు వచ్చాయి. అనంతరం లిఫ్ట్ ఏడో అంతస్తుకు కదిలింది. దీంతో లిఫ్ట్‌ డోర్‌ బయట శరీరం, లోపల కాలు ఉండాగానే లిఫ్ట్ డోర్ మూసుకుపోయింది. లిఫ్ట్‌, గోడ మధ్యలో చిక్కుకున్న ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. ఆమె సహాయం చేయాలంటూ.. కేకలు వేయడంతో సిబ్బంది, టీచర్లు పరుగులు తీశారు. ఆమెను రక్షించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అనంతరం తీవ్రంగా గాయపడిన ఆమెను బయటకు తీసి వెంటనే ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే టీచర్ చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదవశాత్తు జరిగిన ఘటనగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డిప్యూటీ పోలీస్ కమిషనర్ విశాల్ ఠాకూర్ చెప్పారు. ఆమె మృతిపై ఏదైనా అనుమానం కలిగితే ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తామని వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..